in

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవ వీడియో..

Koil Alwar Thirumanjanam At Tirumala

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించింది. పవిత్ర జలాలు, సుగంధ ద్రవ్యాలతో ఉత్సవ విగ్రహాలను, ఆలయ ప్రాకారం మరియు ఇతర ప్రదేశాలను శుద్ధి చేశారు..

సాధారణంగా ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే ఈ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం రోజున ఆలయాన్ని శుద్ధి చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇందులో భాగంగానే ఇవాళ ఆలయ మూల విరాట్ కు నీళ్ళు పడకుండా ఒక తొడుగు ద్వారా భద్ర పరిచిన తరువాత శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని అన్ని ఉత్సవ విగ్రహాలను బయటకు తీసి పసుపు, చందనపు పొడి, కూరగాయల వేళ్లు, కిచ్చిలి గడ్డ వంటి వాటిని నీళ్ళలో కలిపి వాటితో శుద్ధి చేశారు. అటు తరువాత ఆలయ ప్రాకారాలను, ఇతర ప్రదేశాలను మొత్తాన్ని పవిత్రం జలాలు, సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేశారు. అనంతరం తిరిగి ఉత్సవ విగ్రహాలను యధాస్థానంలో ఉంచి, 11 గంటల పైన భక్తులను దర్సనానికి అనుమతిస్తారు.

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ వీడియో .. శ్రీవారి భక్తుల కోసం..

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Throat Pain

మీకు గొంతు నొప్పిగా ఉందా.. అయితే ఈ టిప్స్ పాటించండి

Virat Kohli - Anushka Sharma

కోహ్లీ-అనుష్కల విందుకు తారలు దిగివచ్చిన వేళా..