,

నన్ను చంపేస్తారని భయంగా ఉంది – సినీనటి అపూర్వ

apoorva telugu actress

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు అపూర్వను పది మంది రౌడీలు ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరించారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ ఇవ్వమని కోరారు.

పూర్తి వివరాల్లోకి వెళితే…మదురానగర్‌ సిద్దార్ధనగర్‌లో నివాసముండే అపూర్వ ఫిలింసిటీలో సినిమా షూటింగ్‌ ముగించుకొని ఈ నెల మే 21న ఆమె ప్రయాణిస్తున్న కారును విజయవాడ-చౌటుప్పల్ జాతీయ రహదారిపై మరో కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో అపూర్వ కారు పూర్తిగా దెబ్బతింది. అనంతరం దీంతో మరమ్మత్తులు చేయించడానికి ఢీకొట్టిన వారు అంగీకరించారు. అంతేకాకుండా కారు రిపేరు పూర్తయ్యే వరకు వారి కారును కూడా అపూర్వ వద్దే ఉంచారు.

సోమవారం కొందరు తన ఇంటికొచ్చి కారు ప్రమాదం విషయమై నిలదీసి చంపేస్తామంటూ బెదిరించి వెళ్లారు. ఈ విషయమై ఆమె సంజీవరెడ్డినగర్‌ పోలీసులకు ఆశ్రయించారు. పది మంది రౌడీలు తన ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరిస్తున్నారని అపూర్వసోమవారం ఫిర్యాదు చేశారు. వారి వల్ల తనకు ప్రాణ హాని ఉందన్నారు. ఇంటికి వచ్చిన వారిని గతంలో ఎన్నడూ చూడలేదని తెలిపారు.

పోలీసులు విచారణ చేపట్టారు. అపూర్వ పలు తెలుగు, కన్నడ సినిమాల్లో నటించారు. ఆమె మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది చిత్రంతో 2001 లో ఇండస్ట్రీలో ప్రవేశించారు. సినిమాల్లో సహాయనటిగా చాలా ఫేమస్. ఆమె సినిమాలే కాకుండా టీవీ సీరియల్స్, టీవి షోలు కూడా చేసారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Comments

Leave a Reply

Your email address will not be published.

Loading…

Comments