in

ఒత్తైన, దృఢమైన జుట్టు కోసం ఈ చిట్కాలు

hair health tips

ఒత్తైన, దృఢమైన శిరోజాల సంరక్షణపై మీరు చూపించే శ్రద్ధతో పాటు మీరు తీసుకునే ఆహారం అలాగే ఇతర అలవాట్లు శిరోజాలపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ మధ్యకాలంలో అనేకరకాలైన సమస్యల వలన శిరోజాల అందం దెబ్బతింటోంది. ముఖ్యంగా జుట్లు చిట్టిపోవడమనేది ప్రధాన సమస్యగా మారింది. మరి మీ శిరోజాలను దృఢంగా మార్చుకునేందుకు అవసరమైన సులభమైన చిట్కాల ఏంటో చూద్దాం..

1). ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది. అందువలన మీ శిరోజాలకు తగిన పోషణ లభిస్తుంది. మీ శిరోజాలు వేగంగా, ఆరోగ్యవంతంగా పెరిగేందుకు ఈ విటమిన్ తోడ్పడుతుంది. కాస్తంత వేడి చేసిన ఆలివ్ ఆయిల్ తో మీ స్కాల్ప్ పై మసాజ్ చేసుకోండి. మరుసటి ఉదయాన్నే మీ శిరోజాలను వాష్ చేసుకోండి.

2). గుడ్లనుంచి శిరోజాలకు అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. గుడ్లను ఆహారంలో తీసుకోవడం ద్వారానే కాకుండా శిరోజాల సంరక్షణకు హెయిర్ ప్యాక్ గా కూడా వాడి తగిన ప్రయోజనాలు పొందవచ్చు. గుడ్లలోని తెల్లని సొనను ఒక పాత్రలోకి తీసుకుని అందులో కాస్తంత తేనెని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ స్కాల్ప్ పై అప్లై చేసి ఒక గంట తరువాత శిరోజాలను నీటితో శుభ్రపరుచుకోండి. ఈ చిట్కాని పాటిస్తే మీ శిరోజాలు దృఢంగా, కోమలంగా మారతాయి.

3). కొన్ని ఎండు ఉసిరికాయలని కొబ్బరి నూనెలో మరిగించి, వడగట్టండి. ఇప్పుడు, వడగట్టిన ఈ నూనెతో మీ స్కాల్ప్ పై మృదువుగా మసాజ్ చేయండి. ఒక గంట తరువాత మీ శిరోజాలను నీటితో శుభ్రపరుచుకోండి. ఈ పద్దతిలో వారానికి ఒకసారి మీ శిరోజాలను సంరక్షిస్తే దృఢమైన శిరోజాలు మీ సొంతమవుతాయి.

4). కొంత అలో వెరా జెల్ ను కాస్త కొబ్బరి పాలతో కలిపి ఈ మిశ్రమాన్ని హెయిర్ ప్యాక్ లా అప్లై చేయండి. ఈ చిట్కాను పాటిస్తూ ఉంటే, కాలక్రమేణా, మీ శిరోజాలు మృదువుగా, కోమలంగా తయారవుతాయి.

5). వారానికి ఒకసారి ఈ క్యాస్టర్ ఆయిల్ తో స్కాల్ప్ పై మసాజ్ చేయాలి. ఈ పద్దతి ద్వారా మీ శిరోజాలు దృఢంగా తయారవడమే కాకుండా వేగంగా కూడా పెరుగుతాయి.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Telangana health deapart ment jobs notification

తెలంగాణా ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు, దరఖాస్తు చివరి తేది జనవరి 18

Health Benefits, Finger Millet, Ragi

రాగులు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..!