in

తొలిప్రేమ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే..!

Tholiprema movie review, story, rating, public talk

వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా, సుహాసిని, సప్న ప‌బ్బి, ప్రియ‌ద‌ర్శి, హైప‌ర్ ఆది, విద్యుల్లేఖా రామన్ త‌దిత‌రులు ప్రధాన తారాగణంగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ రోజు మనముందుకు వస్తున్న చిత్రం ‘తొలిప్రేమ’. బాబాయ్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కెరీర్ బ్రేక్ మూవీ తొలిప్రేమ టైటిల్‌తో వరుణ్ తేజ్ రావటం సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ‘తొలిప్రేమ‌’ అంచనాలను అందుకుందా లేదా ఓసారి చూద్దాం..

ఇక కథ విషయానికి వస్తే … లండన్ లో ఉంటున్న ఆదిత్య (వరుణ్ తేజ్) తన ఫెయిల్యూర్ లవ్ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ప్లస్ 2 టైంలో ట్రైన్ జర్నీలో వర్ష (రాశి ఖన్నా)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు ఆదిత్య. ఆ తర్వాత ఇద్దరు ఒకే కాలేజ్ లో జాయిన్ అవుతారు. ఆదిత్య లవ్ ప్రపోజల్స్ కు ఓకే చెప్పేస్తుంది వర్ష. ఇంతలోనే ఇద్దరు పరిస్థితుల కారణంగా విడిపోవాల్సి వస్తుంది. మళ్లీ 6 ఏళ్ల తర్వాత కలుస్తారు.. అప్పుడు మళ్లీ ఇద్దరు ప్రేమించుకుంటారు.. ఇన్ని సంవత్సరాల తరువాత కలిసిన వర్ష, ఆదిత్య లవ్ ని అంగీకరిస్తుందా..? వారిద్దరు అప్పుడు ఎందుకు విడిపోతారు.. మళ్ళీ ఎందుకు కలుస్తారు? అనేది సినిమాలో చూడాల్సిందే.

వ‌రుణ్ తేజ్ ఈ సినిమా ల‌వ‌ర్‌బోయ్ పాత్ర‌లో భాగా కనిపించాడు. ప్రేమ‌, విడిపోవ‌డం అనే సంద‌ర్భాల్లో వ‌చ్చే బాధ‌ను.. వేరియేష‌న్స్‌ను తన పాత్రతో బాగా చూపించాడు. వ‌ర్ష పాత్ర‌లో రాశీ ఖ‌న్నా చ‌క్క‌గా చేసింది. పాత్ర కోసం స‌న్న‌బ‌డ‌టం.. కొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌టం పెద్ద ప్ల‌స్ అనే చెప్పాలి. స‌ప్న ప‌బ్బి పాత్ర చిన్న‌దే అయినా ఉన్నంతలో మెప్పించింది. బ‌జ‌ర్‌ద‌స్త్‌ ఆది, సుహాసిని, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌తో మెప్పించారు.

ఇలాంటి ప్రేమ‌ క‌థ‌ల్లో ఎమోష‌న్స్‌, ఫీల్ అనేది ముఖ్యం. ఈ సినిమాలో అవి మిస్ కాకుండా చూసుకున్నాడు ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి. ఫ‌స్టాఫ్ అంతా ఓ ఫీల్‌తో ర‌న్ అవుతుంది. యితే సెకండాఫ్‌లో ప్రేమ‌కు సంబంధించిన కొన్ని డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి కథ కథనాల్లో తన ప్రతిభ కనబరిచాడు. జార్జ్ సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది. ఫారిన్ లొకేషన్స్ బాగా క్యాప్చర్ చేశారు. తమన్ మ్యూజిక్ బాగుంది. సినిమా మొదటి అర్ధ భాగం చాలా బాగా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. క్లైమాక్స్ కొంచెం మైనస్ అని చెప్పవచ్చు.

మొత్తానికి తొలిప్రేమ చిత్రం ఫీల్ గుడ్ మూవీ. యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. వరుణ్ తేజ్ కి మరో హిట్ చిత్రం అని చెప్పవచ్చు

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

railway employees

13 వేల మంది రైల్వే ఉద్యోగులకు వేటు

pawan kalyan - Kavitha

చెల్లెలు కవిత గారికి ధన్యవాదాలు చెబుతున్నా: పవన్ కళ్యాణ్