, ,

అమెరికాకు హెచ్చరికలు పంపిన ఉత్తర కొరియా

North Korea warns america

అమెరికా బెదిరింపులకు భయపడేదేలేదంటోంది ఉత్తర కొరియా. తమపై దాడి చేస్తే అగ్ర రాజ్యం పరిస్థితి ఎలా ఉంటుందో.. ఏకంగా ఓ వీడియో తీసి మరీ విడుదల చేసింది. అమెరికాపై అణు బాంబు వేస్తే ఎలా ఉంటుందో, ఎంతటి వినాశనం జరుగుతుందో ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపింది. ఉత్తర కొరియా వ్యవస్ధాపకుడు కిమ్‌ 2 సంగ్‌ గౌరవార్ధం నిర్వహించిన ఓ మ్యూజికల్‌ ఈవెంట్‌  లో ఈ వీడియోను ప్రదర్శించారు. అందులో ఉత్తర కొరియా వదిలిన మిస్సైల్స్‌ దెబ్బకు అమెరికా నగరాలు మంటల్లో కాలిపోతున్నట్లు ఉంది. వరుస బెట్టి అమెరికాపై పసిఫిక్‌ తీరం మీదుగా మిస్సైల్స్‌ ను సంధించినట్లు ఉంది. మిస్సైల్స్‌ పేలుళ్లకు అమెరికాలోని ముఖ్యనగరాలు తుడిచిపెట్టుకుపోయినట్లు ఉంది. ఆఖరికి కాలిపోతున్న అమెరికా జెండాతో వీడియో ముగుస్తుంది. వీడియో ప్రదర్శన అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఆనందోత్సహాలతో సంబరాలు జరుపుకున్నారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%