in

కొట్టుకున్న తెలుగు తమ్ముళ్ళు, ఎమ్మెల్యేకు గాయాలు

tdp leaders fight

అనంతపురం జిల్లా గుంతకల్లులో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. అడ్డుకోబోయిన ఎమ్మెల్యేను కూడా పక్కకు నెట్టేశారు. ఈ ఘటన గుంతకల్లు పట్టణంలోని రెండో వార్డులో చోటు చేసుకుంది.జిల్లాలోని గుంతకల్లు పట్టణంలోగల రెండో వార్డులో గురువారం ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా కౌన్సిలర్ గుణశేఖర్, మాజీ ఎంపీటీసీ మస్తానమ్మ వర్గీయులు పరస్పర దాడులకు పాల్పడ్డారు. కాగా… అక్కడే ఉన్న ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్… ఇరువర్గాలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇరువర్గాల వారు ఒక్కసారిగా దూసుకువచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్యే పైకి కూడా దూసుకురావడంతో ఆయన కాలికి గాయమైంది.మరోవైపు ఈ ఘటన టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. వీధుల్లో పరస్పర దాడులకు తెగబడితే, పార్టీ పరువు ఏమవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Aarushi talwar murder case

మరి కాసేపట్లో అరుషి హత్య కేసులో కోర్టు తీర్పు

Airtel 4G smartphone - Karbonn Mobile

జియో దారిలో ఎయిర్ టెల్, రూ.1399కే 4G ఫోన్