in

ఏడాదిగా స్నానం చేయని భార్య, విడాకులు కోసం భర్త

taiwan wife
taiwan wife

తన భార్య సుమారు సంవత్సరంకు పైగా స్నానం చేయడం లేదంటూ భర్త విడాకులు కోసం ఎదురు చూస్తున్న ఘటన తైవాన్ దేశంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే … తైవాన్ దేశానికి చెందిన ఓ యువకుడు అదే దేశానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనంతరం తన భార్య ఏడాదికాలంగా అసలు స్నానం చేయడం లేదని…వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం లేదని భర్త విడాకులకు దరఖాస్తు చేశాడు.

బాధితుడు కోర్టు ముందుంచిన అంశాలను చూస్తే… “ప్రేమించుకునే సమయంలో నా ప్రియురాలు వారానికోసారి స్నానం చేసేది. పెళ్లయిన తర్వాత ఏడాదికోసారి మాత్రమే స్నానం చేస్తోంది. అది కూడా ఆరు గంటల సమయం తీసుకుంటోంది. రోజూ ఉదయం పళ్లను శుభ్రం చేసుకునే అలవాటు కూడా లేదు. ఉద్యోగం చేయవద్దంటూ పోరు పెడుతోంది. దాంతో ఉద్యోగం మానేసి మరో ప్రాంతానికి వెళ్లగా, వెతుక్కుంటూ అక్కడకు కూడా వచ్చి మరీ వేధిస్తోంది. ఆమెతో నేను కాపురం చేయలేను” అంటూ విడాకులు కోరుతున్న వ్యక్తి తన గోడు వెళ్లబోసుకున్నాడు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Jai simha review,talk, story

జై సింహా మూవీ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే..!

OU Students supports mahesh kathi

పవన్ కళ్యాన్..తాట తీస్తాం: ఓయూ విద్యార్థులు