in

3259 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

SSC CHSL Recruitment - LDC, PA, DEO

ఎల్డీసీ, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకెండరీ లెవెల్ ఎగ్జామినేషన్ 2017కు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్/ సోర్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఎంపికైన వారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం ఇవ్వనున్నారు.

మొత్తం పోస్టుల సంఖ్య 3259 కాగా ఎల్డీసీ- 898, సోర్టింగ్ అసిస్టెంట్ 2359, డీఈఓ 2 లు ఉన్నాయి.

విద్యార్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు మాత్రం ఇంటర్మీడియట్‌లో సైన్స్, మ్యాథ్‌మెటిక్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. ఇంగ్లిష్ లేదా హిందీలో టైపింగ్ స్కిల్స్ ఉండాలి.

వయోపరిమితి: 2018 ఆగస్టు 01 నాటికి 18 నుంచి 27 ఏళ్లకు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. ఫీజు కింద జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. మిగతా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రాత పరీక్ష (డిస్క్రిప్టివ్), స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: డిసెంబరు 18

టైర్-1 సీబీటీ తేది: మార్చి 3 నుంచి 26 వరకు

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Bandla Ganesh

బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్ష, 15 లక్షలు జరిమానా

Post Office Recruitment 2017

పోస్టల్ శాఖలో ఉద్యోగాలు