in

బిగ్‌బాస్‌ విజేత శివబాలాజీ, రూ.50 లక్షల నగదు బహుమతి

Bigg boss show winner Shiva Balaji

ఆద్యంతం ఉత్కంఠభరింతంగా సాగిన ‘బిగ్‌బాస్‌ తెలుగు’ తొలి సీజన్‌ రియాలిటీషోలో నటుడు శివబాలాజీ విజేతగా నిలిచారు. ఆయనకు ట్రోఫీ, రూ.50 లక్షల నగదు బహుమతిని ప్రయోక్త జూనియర్‌ ఎన్టీఆర్‌ అందజేశారు. 70రోజుల పాటు జరిగిన ఈ షో ఆదివారంతో ముగిసింది. షో ఫైనల్స్‌లో ఐదుగురు ‘బిగ్‌బాస్‌’ ఇంటి సభ్యులు ట్రోఫీ కోసం పోటీపడ్డారు. నటులు నవదీప్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, తారలు అర్చన, హరితేజ కంటే వీక్షకుల నుంచి శివబాలాజీకి అత్యధిక ఓట్లు వచ్చినట్టు తారక్‌ ప్రకటించారు. ఫైనలిస్టులు ఐదుగురికి కలిపి 11.95 కోట్ల ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు.

అంతకుముందు టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ పెర్‌ఫార్మెన్స్‌తో చివరి ఎపిసోడ్‌ మొదలైంది. గతంలో ఎలిమినేట్‌ అయిన జ్యోతి, దీక్షాపంత్‌, ప్రిన్స్‌, సమీర్‌, సంపూర్ణేశ్‌ బాబు, కత్తి కార్తీక, ధన్‌రాజ్‌, మధుప్రియ, మహేశ్‌ కత్తిని వేదికపైకి ఆహ్వానించారు. గాయని కల్పన, నటి ముమైత్‌ఖాన్‌ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఫైనలిస్టులు ఐదుగురులో ఆదర్శ్‌ రెండో స్థానంలో నిలవగా హరితేజ, నవదీప్‌, అర్చన వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకున్నారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Hydrogen bomb

అమెరికాను హైడ్రోజన్ బాంబుతో భయపెట్టనున్న ఉత్తర కొరియా

Heaviest woman Eman Ahmed

అత్యంత బరువున్న మహిళ ఇమాన్ అబ్దుల్ అట్టీ మృతి