in

పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది

Pawan Kalyan - actor naresh

పవన్‌ కల్యాణ్‌ 2019లో ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ప్రముఖ సీనియర్‌ నటుడు నరేశ్‌ అభిప్రాయపడ్డారు. అలాగే తమిళనాడు లో కమల్ హాసన్ కూడా సీఎం అవ్వాలని ఆశించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌ పెట్టారు. జనసేన పార్టీతోపవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లో అడుగుపెట్టారు. మరో పక్క కమల్‌ హాసన్‌ రాజకీయ ప్రవేశం కూడా దాదాపు ఖరారైపోయింది. మరో పది నెలల్లో ఆయన తన పార్టీ వివరాలు ప్రకటిస్తానని చెప్పారు.

ఈ నేపథ్యంలో నరేశ్‌ ఓ ట్వీట్‌ పెట్టారు. ‘లక్షల మంది అభిమానులు, ప్రజలు.. కమల్‌, పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రులు కావాలని కలలు కంటున్నారు. అదే జరిగితే అప్పటి నందమూరి తారకరామారావు, ఎంజీఆర్‌ల శకాన్ని మళ్లీ చూడొచ్చు’ అని ట్వీట్‌ పెట్టారు. నరేశ్‌ ట్వీట్‌కి అభిమానులు కూడా పాజిటీవ్‌గానే స్పందించారు. ఈ మాటలు నిజం కావాలని తామూ కోరుకుంటున్నట్లు కామెంట్లు పెట్టారు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Amla - indian gooseberry

ఉసిరికాయ జ్యూస్ తాగితే ఎన్ని రకాల వ్యాధులు నయమవుతాయో తెలుసా..!

swara bhaskar

నన్ను లైంగికంగా వేధించారు: హీరోయిన్ స్వర భాస్కర్