in

సప్తగిరి ఎల్‌ఎల్‌బి రివ్యూ, సినిమా ఎలా ఉందంటే..!

Sapthagiri LLB Movie Review
Sapthagiri LLB Movie Review

సప్తగిరి, కౌశిష్‌ బోహ్రా, సాయికుమార్‌, శకలక శంకర్‌, డా. శివప్రసాద్‌ మరియు డా. రవికిరణ్‌ ప్రధాన తారాగణంగా డా. కె.రవికిరణ్‌ నిర్మాణంలో చరణ్‌ లక్కావుల దర్శకత్వం వహించిన చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. దర్శకుడిగా తొలి అవకాశంగా చరణ్‌ తీసుకున్న ఈ చిత్రం ‘జూలీ ఎల్‌ఎల్‌బి’ అనే బాలీవుడ్‌కు రీమేక్‌. గురువారమే విడుదలైన ఈ చిత్రం కథ ఏంటో చూద్దాం..

కథ విషయానికి వస్తే … ఎల్‌ఎల్‌బి పూర్తిచేసి తనుండే ఊరిలో పంచాయితీ రచ్చబండపై కేసుల్ని ఇట్టే పరిష్కరించే సప్తగిరికి జిల్లా కోర్టులో చుక్కెదురవుతుంది. దాంతో హైదరాబాద్‌ వెళ్ళి మరింతగా రాటుదేలాలనే నిర్ణయానికి వస్తాడు. అప్పటికే మరదల్ని పెళ్లి చేసుకోవాలకున్న అతడి నిర్ణయాన్ని మేనమామ కాదనడంతో గొప్ప లాయర్‌గా పేరు తెచ్చుకుని వచ్చి పెళ్లిచేసుకుంటానని ఛాలెంజ్‌ విసురుతాడు. అలా వచ్చిన సప్తగిరికి ప్రఖ్యాత లాయర్‌ సాయికుమార్‌తో ఢీ కొట్టాల్సివస్తుంది. క్లోజ్‌ అయిన కేసును సప్తగిరి పిల్‌ వేసి అసలు దోషికి ఎలా శిక్ష పడేలా చేశాడన్నదే కథ.

హాస్యనటుడిగా ప్రజాదరణ పొందిన సప్తగిరి సీరియస్‌ అంశాన్ని తీసుకుని మెప్పించండం అనేది పెద్ద సాహసమే. తన నటనతో ఈ చిత్రంలో సప్తగిరి 100 మార్కులు వేయించుకున్నాడు. తనూ బిఎ ఎల్‌ఎల్‌బి చేసిన పద్మనాభం తన మరదలిని పెళ్లి చేసుకోవడానికి పడిన పాట్లతో పాటు జమిందార్‌ మర్డర్‌ కేసును టేకప్‌ చేసే సీనియర్‌ లాయర్‌ రావికొండలరావుతో పద్మనాభం జరిపిన వాగ్వివిదాదం క్లైమాక్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇక సప్తగిరి ఎల్‌ఎల్‌బిలోనూ కారు ప్రమాదంలో చనిపోయిన ఆరుగురు రైతుల్ని బిచ్చగాళ్ళుగా కోర్టును నమ్మించి కోటీశ్వరుడి మనవడ్ని కాపాడే ప్రయత్నంలో తిమ్మినిబమ్మిని చేసే ఉద్దండ లాయర్‌ సాయికుమార్‌కు చెమటలు పట్టించే పాత్రలో సప్తగిరి మెప్పించాడు. రైతుల్ని బిచ్చగాళ్లుగా ట్రీట్‌ చేసే సన్నివేశంలో రైతుబిడ్డగా తన బాధను ఆవేశాన్ని ముఖకవళికల్లోనూ చేతల్లోనూ నిరూపించి మెప్పించాడు. ఇలా భిన్న కోణాల్ని ఆవిష్కరించి పాత్రకు న్యాయం చేశాడు.

ఈ చిత్రంలో సప్తగిరి నటనతో పాటు పరుచూరి మాటలకు, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కు ఒక్కసారిగా జతకట్టి చిత్రాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్ళాయి. డాక్టర్‌గా సమాజానికి ఏదో చేయాలన్న తపనతో డా. రవికిరణ్‌ చేసిన ప్రయత్నం అభినందనీయం. చూసిన ప్రతి ఒక్కరినీ ఆనందింపచేసి, ఆలోచించేట్లుగా చేయగల ఈ చిత్రం ప్రేక్షకులని ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

LG V30 Plus

అదిరిపోయే ఫీచర్లతో ఎల్‌జీ వీ30 ప్లస్ స్మార్ట్ ఫోన్

Acidity

ఎసిడిటికి చెక్ పెట్టండిలా..!