in

రవితేజ ఫ్యాన్స్ షాక్‌: రవితేజ కొడుకు అంధుడట

ravi teja son mahadhan

మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఆ సినిమా టీజర్‌ ఇటీవలే విడుదలై ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమాలో రవితేజ తనయుడు మహాధన్‌ నటించబోతున్నాడు. రవితేజ ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంలో గుడ్డి వాడిగా కనిపించనున్న విషయం తెల్సిందే. సినిమా మొత్తంలో కూడా రవితేజ అలాగే కనిపిస్తాడు.

అయితే చిన్నప్పుడు రవితేజ పాత్రను ఆయన తనయుడు మహాధన్‌ చేయబోతున్నాడు. మహాధన్‌ గుడ్డి వాడిగా కనిపించే పాత్రలో నటించబోతున్నాడు. మహాధన్‌ మొదటి సినిమాలోనే గుడ్డి వాడిగా నటించబోతుండటంతో రవితేజ ఫ్యాన్స్ షాక్‌ అవుతున్నారు. ఒక స్టార్‌ హీరో తనయుడు గుడ్డి వాడి పాత్రతో ఎంట్రీ ఇవ్వడం ఏంటని సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రవితేజ మాత్రం ఇలాంటి పాత్రతో అయితేనే గుర్తింపు వస్తుందని, నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి పాత్రలే చేయాలనిభావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలో ఆ పాత్రను మహాధన్‌తో చేయిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని దిల్‌రాజు వ్యక్తం చేశాడు. అందుకు దర్శకుడు అనీల్‌ రావిపూడి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, రవితేజ ఒప్పుకోవడం జరిగిపోయాయి. ఇలా రవితేజ తనయుడు మహాధన్‌ ‘రాజా ది గ్రేట్‌’ చిత్రంతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

What do you think?

-1 points
Upvote Downvote

Total votes: 1

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 1

Downvotes percentage: 100.000000%

india vs Sri Lanka Cricket match

నేడు భారత్-శ్రీలంక టీ-20 మ్యాచ్, మార్పులతో శ్రీలంక జట్టు

kangana Ranaut waiting for boy friends

విరహంతో రగిలిపోతూ మగాళ్ళ కోసం చూస్తున్న కంగనా ర‌నౌత్