in

అప్పుడు లాస్యాను కోల్పోయాను, ఇప్పుడు శ్రీముఖిని దూరం చేయద్దు: రవి

Ravi srimukhi lasya

టీవీ యాంకరింగ్ లలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న రవి, శ్రీముఖిలు ఓ ఇంటర్వ్యూలో కొన్ని సంచలనమైన విషయాలు బయటకు చెప్పుకొచ్చారు. ఇద్దరూ చాలా క్లోజ్ గా కనిపించిన ఈ షో లో ఆలీ అడిగిన ప్రశ్నలకి చాలా తుంటరి సమాధానాలు చెప్పారు వీరిద్దరూ. ఒక్క మాటలో రవి గురించి ఏం చెప్తారు అంటే ” పిచ్చోడు ” అంటూ బాంబు పేల్చింది ఆమె. రవిని గొరిల్లా అనే జంతువు తో పోలుస్తా అని చెప్పిన ఆమె మనిషి గొరిల్లా, కోతి నుంచి వచ్చాడు అనీ అందుకే రవి కూడా అలాగే కోతి వేషాలు వేస్తాడు అని సరదాగా అంది. రవి డ్యాన్స్ చేస్తున్నప్పుడు దూరం నుంచి చూస్తుంటే తనకు కోతే కనిపిస్తుందని చెప్పుకొచ్చింది శ్రీముఖి. కామెడీ నటుడు అలీ ప్రయోక్తగా సాగుతున్న ఓ షోలో ఇది జరిగింది.

వారిద్దరి మధ్యనా ఏదో ఉంది అంటూ సోషల్ మీడియా లో వచ్చే గుసగుసలకి ఏం సమాధానం చెప్తారు అంటే మేము అసలు అలాంటివి కేర్ చెయ్యడం ఏదైనా ఉంటె ఖచ్చితంగా చెప్తాం కదా అని శ్రీముఖి అన్నారు. మరొక పక్క రవి మాత్రం ఒకప్పుడు లాస్య కీ తనకీ ఇలాగే అక్రమ సంబంధం అంటగట్టారు. దానివల్ల తనొక మంచి ఫ్రెండ్ ని కోల్పోయాను ఇప్పుడు మళ్ళీ ఈరూపంలో శ్రీముఖిని కూడా దూరం చెయ్యద్దు అన్నాడు రవి. స్నేహితుల మధ్యన ఏదేదో అంటగట్టడం ఫ్యాషన్ అయీపోయింది అని కాస్త ఘాటు సమాధానం చెప్పాడు రవి.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

adah sharma look in airport

కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతున్న ఆదాశర్మ

Akansha Sharma-Yuvraj Singh

యువరాజ్ సింగ్‌పై గృహ హింస కింద కేసు నమోదు