,

అల్లు అర్జున్ రికార్డును బద్దలుకొట్టిన రేష్మీ

Rashmi Gautam beats Allu Arjun Record

రికార్డులు ఎవరి సొంతం కాదని యాంకర్ రేష్మీ నిరూపించింది. తాజాగా అల్లు అర్జున్ కి సంభందించిన ఓ రికార్డును ఈ అమ్మడు బద్దలుకొట్టింది. యూట్యూబ్ లెక్కలోకి వెళ్లితే ఇప్పటి దాకా మన టాలీవుడ్‌లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న పాటగా అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘రేసు గుర్రం’ చిత్రంలోని ‘సినిమా చూపిస్తా మామ’ అనే పాట ఇప్పటిదాకా 1 కోటి 96 లక్షల వ్యూస్‌తో రికార్డ్ సృష్టించింది. దీంతో అల్లు అర్జున్ ఖాతాలో ఒక అరుదైన రికార్డ్ ఇంత కాలం భద్రంగా ఉన్నట్టయింది.

అయితే హీరోయిన్ మరియు టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ ఇప్పుడు ఆ రికార్డుని బద్దలుకొట్టేసింది. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఈ సంవత్సరంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ చిత్రం మంచి విజయాన్నే సాధించింది.ముఖ్యంగా ఈ సినిమాలో రష్మీతో చిత్రీకరించిన మాస్ మసాలా సాంగ్ అయిన ‘నీ సొంతం’ అనే పాట మాస్ జనాన్ని ఒక ఊపు ఊపేసింది. దాంతో ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే 2 కోట్ల 3 లక్షల వ్యూస్‌ని సాధించేసి బన్నీని దాటి ముందు వరుసలో నిలబడింది. పైగా బన్నీ పాట రెండేళ్లలో సాదించిన వ్యూస్‌ని రష్మీ పాట కేవలం ఏడాదిలోపే దక్కించుకోవడం మరో విశేషం. ఏది ఏమైనా మరే హీరో క్రాస్ చేయలేని బన్నీ రికార్డ్‌ ని రష్మీ తన హాట్ అందాలతో సరి కొత్త రికార్డ్ నెలకొల్పింది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%