,

నష్టపోయేది సత్యరాజ్ కాదు, సినిమా యూనిట్: రాజమౌళి

SS Rajamouli requests for baahubali release

కర్నాటకలో బాహుబలి-2 రిలీజ్ విడుద‌ల‌య్యేందుకు క‌న్న‌డిగులు స‌హ‌క‌రించాల‌ని కోరారు ఆ చిత్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న ఓ వీడియోను రిలీజ్ చేశారు. స‌త్య‌రాజ్ చేసిన వ్యాఖ్య‌లు అత‌ని వ్య‌క్తిగ‌త‌మ‌న్న జ‌క్క‌న్న ఒక‌వేళ సినిమా విడుద‌ల‌ను అడ్డుకుటే న‌ష్ట‌పోయేది స‌త్య‌రాజ్ కాద‌ని చిత్ర నిర్మాత, చిత్ర బృందం అని అన్నారు. సినిమా కోసం ఎంతోమంది న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు క‌ష్ట‌ప‌డి ప‌నిచేశార‌ని ..రిలీజ్‌ను అడ్డుకుంటే అంద‌రూ న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌న్నారు. బాహుబ‌లి తొలిభాగాన్ని ఆద‌రించిన‌ట్టుగానే బాహుబ‌లి-2ను కూడా ఆద‌రించాల‌ని క‌న్న‌డిగుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు రాజ‌మౌళి. క‌న్న‌డిగుల‌కు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వ్వాల‌న్న ఉద్దేశంతో రాజ‌మౌళి ఆ వీడియోలో క‌న్న‌డ‌లోనే మాట్లాడ‌టం విశేషం. అంతేకాదు క‌న్న‌డ త‌న‌కు స‌రిగ్గారాద‌ని ఏవైనా త‌ప్పులు దొర్లితే క్ష‌మించాలని రాజమౌళి చెప్పుకొచ్చారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%