in

త్రిపాఠి వీర విహారం, కేకేఆర్ పై పుణె ఘన విజయం

Rahul Tripati

ఐపీఎల్‌ పదో సీజన్‌ లో సూపర్‌ జెయింట్‌ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. కోల్‌ కతాతో ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్‌లో.. 4 వికెట్ల తేడాతో పుణె గెలుపొందింది. ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన కోల్‌ కతా.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 రన్స్‌ చేసింది. బ్యాట్స్‌ మెన్లలో గంభీర్‌ 24, పాండే 37, గ్రాండ్‌ హోమ్‌, ఉమేష్‌ యాదవ్‌లు 30 రన్స్‌ చేయడంతో కోల్‌ కతా టీమ్‌ ఓ మోస్తరు స్కోర్‌ ను ప్రత్యర్థి ముందు ఉంచింది.

156 రన్స్‌ టార్గెట్‌ తో బరిలోకి దిగిన పుణె ఏదశలోనూ కోల్‌ కతా పై గెలిచేలా కనిపించలేదు. రన్స్‌ చేజింగ్‌లో ఓపెనర్‌ త్రిపాఠి 52 బాల్స్‌ లో 93 రన్స్‌ తో రెచ్చిపోయాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్ లో త్రిపాటి కోల్‌ కతా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. మిగతా ప్లేయర్స్‌ ఎవ్వరూ రాణించకున్నా.. త్రిపాఠి విజయాన్ని అందించాడు. మరో నాలుగు బంతులుండగానే.. పుణె గ్రాండ్‌ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్‌ లో విజయంతో.. మొత్తం 14 పాయింట్లతో పుణె టాప్‌ త్రీలో నిలిచింది. అటు త్రిపాఠికి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌ లభించింది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Father carries his son dead body

అంబులెన్స్ లేక కొడుకు శవాన్ని మోసుకెళ్లిన తండ్రి

actor pradeep suicide

సినీనటుడు ప్రదీప్‌ ఆత్మహత్య