in

అందాలు ఆరబోసింది, కానీ సినిమా ఆగిపోయింది

raai Laxmi - Julie 2

దక్షిణాదిన సినిమా అవకాశాలు లేక డీలా పడిన నేపథ్యంలో రాయ్ లక్ష్మీకి బాలీవుడ్ చిత్రం జూలీ 2 రూపంలో ఒక మంచి అవకాశం వచ్చింది. దీంతో ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ రెచ్చిపోయి నటించింది. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడకుండా ఈ చిత్రంలో నటించింది. అప్పటిదాకా కనిపించని తీరుగా ఈత దుస్తుల్లో స్వేచ్ఛగా నటించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను చూసి దక్షిణాది ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇక బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ తమకు పనికొచ్చే మరో నాయిక దొరికిందని భావించారు.

ప్రచారంలో వచ్చిన పేరు…చిత్రం విడుదలయ్యాక పెరుగుతుందని లక్ష్మీ రాయ్‌ ఆశించింది. అయితే ఈ కలలన్నీ చెదిరిపోయాయి. ప్రణాళిక ప్రకారం ఈ నెల 6న ‘జూలీ 2’ విడుదలవ్వాల్సి ఉండగా…కాపీ రైట్‌ వివాదాల కారణంగా చిత్ర విడుదల ఆగిపోయింది. దీంతో రాయ్ లక్ష్మీ షాక్ గురైంది. ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని కూడా నిర్మాతలు చెప్పే పరిస్థితులు లేవు. దీంతో బాలీవుడ్‌లో మెరవాలన్న లక్ష్మీ రాయ్‌ కోరిక సందిగ్ధంలో పడింది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Airtel 4G smartphone - Karbonn Mobile

జియో దారిలో ఎయిర్ టెల్, రూ.1399కే 4G ఫోన్

Sasikala Natarajan in jail

శశికళ మళ్ళీ జైలుకు, ముగిసిన పెరోల్ గడువు