, ,

మీ ఆధార్ లో తప్పులుంటే పోస్టాఫీసులో ఇలా సరిచేసుకోవచ్చు

aadhar card update at post offices

ఇప్పుడు అన్నింటికీ ఆధారమైపోయిన ఆధార్ కార్డులో తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం ఓ సులువైన అవకాశం కల్పించింది. పోస్టాఫీసుల్లోనే సింపుల్ గా ఆధార్ ను ఎడిట్ చేసుకోవచ్చు. 15 నిమిషాల్లో అప్‌డేట్ చేసేస్తారు. 24 గంటల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 15 రోజుల్లో ఒరిజినల్ కార్డు తెచ్చుకోవచ్చు. ఆధార్‌ అప్‌డేషన్‌కు రూ.25 వసూలు చేస్తారు. అంతేకాదు..బయోమెట్రిక్‌కు రూ.25, కొత్తగా జనరేట్‌ కోసం రూ.50 వసూలు చేస్తారు. ఆధార్ సంస్థ ఇండియన్ పోస్టల్ డిపార్టు మెంటుతో దేశ వ్యాప్తంగా ఈ సర్వీసు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది.

రాష్ట్రంలోని హెడ్‌ పోస్టాఫీసుల్లో ఆధార్‌ అప్‌డేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని పాతబస్తీలోని జూబ్లీ హెడ్‌ పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన ఆధార్‌ కేంద్రంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టగా, మిగతా పోస్టాఫీసుల్లో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 1 నుంచి జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లోని అన్ని సబ్‌ పోస్టాఫీసుల్లో కేంద్రాలు ప్రారంభించే విధంగా తపాలా శాఖ చర్యలు చేపట్టింది. తపాలా శాఖ సిబ్బందికి ఆధార్‌ నమోదు, అప్‌డేషన్‌పై యూ ఐడీఏఐచే శిక్షణ ఇప్పించారు. ప్రధాన పోస్టాఫీసుల్లో త్వరలో ఆధార్‌ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%