Politics

More stories

 • DINAKARAN

  , ,

  పోలీసుల ముందు హాజరుకానున్న దినకరన్

  అన్నాడీఎంకె మాజీ నేత టీటీవీ దినకరన్‌ నేడు, రేపుగానీ పోలీసుల ముందు హాజరుకానున్నాడు. ఆయన నుంచి సరైన సమాధానం రాకుంటే విచారించేందుకు అరెస్ట్ చేసే ఛాన్స్ వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలను గమనించిన దినకరన్, పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు దినకరన్ విదేశాలకు పారిపోవచ్చుననే సమాచారంతో ఢిల్లీ పోలీసులు ముందస్తుగా లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. ఆర్కేనగర్ ఉపఎన్నిక నేపథ్యంలో రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు […]

 • CRPF jawan in jammu

  , ,

  అల్లరిమూకలు వెకిలి చేష్టలపై నోరు విప్పిన జవాన్

  జమ్ములో సిఆర్పీఎఫ్ జవాన్లను అల్లరిమూకలు వెకిలి చేష్టలతో అవమానపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్వయంగా ఆ బాధ అనుభవించిన జవాను విశ్వకర్మ స్పందించారు. ఎన్నికల విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో వారు మాపై దుర్భాషలాడుతూ వెకిలి చేష్టలతో అవమానపరిచినా తాము తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలనుకున్నామని, మమ్మల్ని మేము రక్షించుకుంటూ దేశ ప్రయోజనాలు ఏవిధంగా కాపాడాలో శిక్షణలో బాగా నేర్పించారని చెప్పారు. అందుకే సమన్వయంతో ఆ సమయంలో మౌనంగా ఉన్నామన్నారు. తాము రాళ్లు రువ్వే […]

 • Red beacon cars banned

  , ,

  కేంద్రం సంచలన నిర్ణయం, ఎర్ర బుగ్గ కార్లు నిషేధం

  కేంద్ర ప్రభుత్వం వీఐపీలు ఉపయోగించే ఎర్ర బుగ్గ కార్లపై నిషేధం విధించింది. మే 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో  ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జీలు, ఐఏఎస్ అధికారులు ఎవ్వరూ ఇకపై బుగ్గ కారులు ఉపయోగించరాదు. కేవలం అత్యవసర సేవల్లో ఉపయోగించే వాహనాలకు, అంబులెన్సులకు మాత్రమే ఎర్రబుగ్గ కారులు ఉపయోగిస్తారు. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు […]

 • nara lokesh slips tongue once again

  , ,

  ఏమైంది లోకేష్ నీకు, ఎందుకీ ఈ తడబాటు

  తూర్పు గోదావరి జిల్లా కరపలో జరిగిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ మ‌రోసారి మరోసారి తడబడ్డారు. క‌ర‌ప‌లో ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో పల్లెల్లో … త్రాగునీరు లేని ఇబ్బందిని ఏర్పాటు చేయడమే.. తన లక్ష్యమని అన్నారు. నారా లోకేష్ ఇలా చెప్పడంతో కరప వాసులు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. గతంలో కూడా అంబేద్క‌ర్ జ‌యంతిని వ‌ర్థంతి అంటూ వ్యాఖ్యానించి అభాసుపాలు అయిన విషయం తెలిసిందే.

 • TTV Dinakaran

  , ,

  దినకరన్‌ ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు

  ఆర్కే నగర్‌ ఉప ఎన్నికల్లో పార్టీ గుర్తు కోసం ఎలక్షన్‌ కమిషన్‌కు లంచం ఇచ్చే కేసులో దొరికిపోయిన అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు ఉచ్చు మరింతగా బిగిసింది.ఈ కేసులో దినకరన్‌ను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదయం 10 గంటలకు తనపై ఉన్న ఫెరా కేసు విచారణలో భాగంగా ఆయన హైకోర్టుకు హాజరు కానుండటంతో, కేసు విచారణ ముగిసిన వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని సమాచారం. […]

 • Sasikala- TTV Dinakaran

  , ,

  పార్టీ నుంచి శశికళ ఫ్యామిలీ గెంటివేత

  అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌లను పార్టీ నుంచి గెంటేసారు. వారి కుటుంబాలను పార్టీ, ప్రభుత్వం నుంచి పక్కన పెడుతున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పళని స్వామి అధ్యక్షతన ఆయన నివాసంలో మంగళవారం రాత్రి 9.45 గంటలకు జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. శశికళ బహిష్కరణను 122 మంది ఎమ్మెల్యేలు సమర్థించడం గమనార్హం. పార్టీని, ప్రభుత్వాన్ని నడిపించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి జయకుమార్‌ తెలిపారు, ఆ కమిటీయే […]

 • Vijay Mallya

  , ,

  కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా అరెస్ట్

  కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. లండన్‌లో విజయ్‌మాల్యాను స్కాట్‌లాండ్‌ యార్డ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్యాను కాసేపట్లో వెస్ట్‌ మినిస్టర్‌ కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. గత ఏడాది మార్చి 2న లండన్‌ పారిపోయిన మాల్యా రూ.9 వేల కోట్లను బ్యాంకులకు ఎగవేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భారతకోర్టులు జారీ చేసే అరెస్ట్ వారెంట్లు తననేమీ చేయలేవని.. నన్నెవరూ అరెస్ట్ చేయలేరని విజయ్ మాల్యా గతంలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే..అయితే, తాను లొంగిపోయేందుకు సిద్దమేనని […]

 • Panneerselvam camp celebrations

  , ,

  ఇది మొదటి డిమాండ్‌: పన్నీర్‌ సెల్వం

  పళనిస్వామి వర్గంతో కలిసిపోయి అన్నాడీఎంకే పగ్గాలు చేపడుతాడనుకున్న పన్నీర్‌ సెల్వం అనూహ్యరీతిలో శశికళపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. అమ్మకు శశికళ, ఆమె కుటుంబసభ్యులంతా ద్రోహం చేశారని, విద్రోహులంతా పార్టీ నుండి బయటకు వెళ్లాలని ఆయన తేల్చిచెప్పారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదని, దినకరన్‌, ఆమె తమ పదవులకు రాజీనామా చేయాలని తెలిపారు. ఇక ఇప్పటికైనా జయలలిత మృతిపై న్యాయవిచారణ జరగాల్సిందేనని, అదే తన మొదటి డిమాండ్‌ అని ఆయన అన్నారు. అమ్మ ఆశయాలు నెరవేర్చడమే తమ […]

 • badikostha scheme

  , ,

  బడికొస్తా పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం

  ఏపీ ప్రభుత్వం కొత్త పథకం ‘బడికొస్తా’ ను సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా విద్యార్థినులకు సైకిళ్లను అందచేశారు. రాష్ట్రంలోని లక్షా 82వేలమంది 9వ తరగతి విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం 75 కోట్లు కేటాయిస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఆదినారాయణరెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 • Panneerselvam vs Sasikala

  , ,

  శశికళ వర్గంలో కలిసిపోనున్న పన్నీర్‌ వర్గం

  అధికార అన్నాడీంఎకేలోని రెండు చీలికలైన పన్నీర్‌, శశికళ వర్గం మళ్లీ కలిసిపోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఈ రోజు కీలక ప్రకటన వెలువడే అవకాశముంది. ఇక మరోవైపు పన్నీర్‌ వర్గాన్ని తమలో చేర్చుకునేందుకు సీఎం పళనిస్వామి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అంగీకారం తెలిపినట్టు సమాచారం. శశికళ వర్గీయులపై వరుసగా ఆరోపణలు వెల్లువెత్తడంతో పన్నీర్‌ వర్గాన్ని తమలో విలీనం చేసుకునేందుకు అధికార వర్గం ముందుకు వచ్చినట్టు విశ్వనీయవర్గాల సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ […]

 • TTV Dinakaran

  , ,

  దినకరన్ అడ్డంగా బుక్కయ్యాడు

  అన్నాడీఎంకే పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ దినకరన్‌ అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళ్తే ….ఆర్కే నగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో రెండుఆకుల గుర్తు కోసం ఏకంగా ఈసీకి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు దినకరన్. ఆ రెండుఆకుల గుర్తు తమకే వచ్చేలా చూడాలని రూ.50 కోట్లతో సుఖేశ్‌చంద్రశేఖర్ అనే వ్యక్తితో బేరం కుదుర్చుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.  ఆయనపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ క్రమంలో దినకరన్‌, ఎన్నికల కమిషన్‌కు క్రైం బ్రాంచ్‌ […]

 • KCR- mudragada

  , ,

  కేసీఆర్‌ పై పొగడ్తల వర్షం కురిపించిన కాపు ఉద్యమనేత ముద్రగడ

  ఎన్నికల మేనిఫెస్టో చిత్తు కాగితం కాదని రుజువు చేశారంటూ తెలంగాణ కేసీఆర్‌ను అభినందించారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం. పదవులు, ఆస్తులు శాశ్వతం కాదని, మాట నిలబెట్టుకోవడం ముఖ్యమని అందులో భాగంగా ముస్లింలు, ఎస్టీ రిజర్వేషన్లపై కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయమని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు డబ్బు ఖర్చుల్లేని ఎన్నికలు నిర్వహించి మరింత మంచిపేరు తెచ్చుకోవాలని ముద్రగడ తన లేఖలో కేసీఆర్‌కు సూచించారు. ఇదిలా ఉంటే ముస్లింల రిజర్వేషన్లను 12 […]