in

పవన్‌ సినిమాలు మానేస్తేనే మంచిది, ఈ అవమాన భారం మేము పడలేము

pawan kalyan fans disappointed
pawan kalyan fans disappointed

పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తానని చెప్పినప్పుడు అభిమానులు తెగ బాధపడిపోయారు, అయితే అజ్ఞాతవాసి చిత్రం విడుదలైన తరువాత పవన్ సినిమాలు మానేస్తేనే మంచిందని అభిమానులే ఆవేదనతో చెప్తున్నారు. కనీసం కథ ఎలా ఉంది..నచ్చుతుందా లేదా అనేది కూడా చూసుకోకుండా సినిమాలో నటించాడని దీని వల్ల అభిమానులు ఎంత బాధపడతారు..? బయ్యర్లు ఎంత నష్టపోతారు..? ఎంత నష్టం వస్తుందనేది కూడా ఏ మాత్రం ఆలోచించలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా సినిమా వచ్చిన ప్రతిసారీ భారీ అంచనాలతో వెళ్లి అవమాన భారం పడే కంటే పూర్తిగా సినిమాలు మానేసాడని ఒకేసారి బాధ పడి సైలెంట్ గా ఉంటేనే మంచిదని వారు వాపోతున్నారు. రాజకీయాలు, సినిమా అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తోన్న పవన్‌ కనీసం రాజకీయ రంగంలో అయినా ముద్ర వేయాలని కోరుకుంటున్నామని వారు చెపుతున్నారు. మొత్తానికి అజ్ఞాతవాసి మూవీ పవన్ రాజకీయాల ఫై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. చూద్దాం పవన్ జాతకం ఎలా ఉంటుందనేది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

HIV capsuls

హెచ్ఐవీకి మందు రోజూ వేసుకోవాల్సిన పని లేదు, వారానికి ఒకసారి చాలు

Jai simha review,talk, story

జై సింహా మూవీ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే..!