,

పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం స్టొరీ లీకయింది

Pawan Kalyan and SJ Surya

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం ఏప్రిల్ 27వ తేదీన లాంఛనంగా ప్రారంభమైన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమా స్టొరీ లీకయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో పవన్ ఓ ఫ్యాక్షన్ లీడర్ కాగా.. రాజకీయాల్లో జరుగుతున్న అక్రమాలను ఓవైపు ఎండగడుతూనే.. మరోవైపు అతని లవ్ స్టోరీ కొనసాగుతుందట. హీరోయిన్ కూడా అతనికి సపోర్ట్ చేస్తుందని, ఈ విషయం తెలుసుకున్న విలన్లు ఆమెను కిడ్నాప్ చేసి పవన్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తారని.. ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ సినిమా కథ అంటూ ఓ స్టోరీ చక్కర్లు కొడుతోంది.

మొత్తానికి ఈ చిత్రంలో పవన్ ఒక ఫ్యాక్షన్ లీడర్‌గా సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడని సమాచారం. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%