in

పద్మావత్ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే..!

padmavaat movie review, story, public talk copy
padmavaat movie review, story, public talk copy

దీపికా ప‌దుకొనే, ర‌ణ‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్‌, అదితిరావు హైద‌రీ త‌దిత‌రులు ప్రధాన తారాగణంగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పద్మావత్’. వివాదాలతో అసలు విడుదలవుతుందా? లేదా? అన్న సందేహంతో ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమావిడుదలకు ముందే యూనిట్‌ పై దాడులు జరిగాయి. సినిమా పూర్తయిన తర్వాత సినిమాను విడుదల చేయకూడదని రాజ్‌పుత్ కర్ణిసేనలు ఆందోళనలు చేపట్టడం సహా కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు కొందరు సినిమా విడుదలపై అభ్యంతరాలను వ్యక్తం చేసారు.. కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు పద్మావత్ పై నిషేధం కూడా విధించాయి. అయితే సెన్సార్ వారు ఐదు కట్స్ విధించి సినిమా విడుదలకు అనుమతి ఇస్తూనే టైటిల్‌ను ‘పద్మావత్’గా మార్చమని సలహా ఇవ్వడంతో సినిమా విడుదలకు నోచుకుంది. అసలు ఈ చిత్రం కథ ఏమిటో చూద్దాం..

padmaavat
padmaavat

కథ విషయానికి వస్తే … 1540లో సూఫీ కవి మాలిక్ మహ్మద్ అవధి భాషలో రాసిన పద్మావత్ అనే పద్యకావ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీ. కథలోకి వెళ్తే.. సింహళదేశపు (నేటి శ్రీలంక) యువరాణియైన పద్మావతి (దీపికా పదుకునే) మహాద్భుత సౌందర్యరాశి. అమె అందచందాల గురించి కథలుకథలుగా చెప్పుకొంటారు. మేవార్ రాజు అయిన రావల్ రతన్‌సింగ్ (షాహిద్‌కపూర్) అరుదైన ముత్యాల అన్వేషణ కోసం సింహళ దేశాన్ని సందర్శిస్తాడు. రాణి పద్మావతిని చూసి మంత్రముగ్ధుడై ఆమె అంగీకారంతో పెళ్లాడతాడు. తన రాజధాని చిత్తోర్‌ఘడ్‌కు తీసుకెళ్లి మహారాణిగా పట్టాభిషేకం చేస్తాడు. ఓ రోజు వారిద్దరు ఏకాంతంలో ఉండగా రాజగురువు రాఘవకేతనుడు రహస్యంగా చూస్తాడు.

దీంతో రావల్త్రన్‌సింగ్ ఆగ్రహించి రాఘవకేతనుడిని రాజ్య బహిష్కరణ చేస్తాడు. మరోవైపు ఢిల్లీ సుల్తాన్ అయిన తన పెద్దనాన్న జలాలుద్దీన్ ఖిల్జ్జీని అంతమొందించి ఆ సింహాసనాన్ని అల్లా ఉద్దీన్‌ఖిల్జ్జీ (రణవీర్‌సింగ్) ఆక్రమిస్తాడు. కామపిపాసి అయిన అతను రాఘవకేతనుడి ద్వారా పద్మావతి సౌందర్యం గురించి తెలుసుకొని ఆమెను పొందాలనే కాంక్షతో మేవార్‌పై దండెత్తుతాడు. మేవార్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడే ఆరునెలలు మకాం వేసి చివరకు వారితో సంధికి వస్తాడు. రతన్‌సింగ్ ఆతిథ్యాన్ని స్వీకరించే నెపంతో పద్మావతిని చూడాలని కోరుతాడు. ఈ క్రమంలో రతన్‌సింగ్‌ను బంధీగా పట్టుకొని ఢిల్లీకి తీసుకెళ్తాడు.

padmaavat - ranveer singh
padmaavat – ranveer singh

తన భర్తను రక్షించుకోవడానికి రాణిపద్మావతి ఢిల్లీకి బయలుదేరుతుంది. తన రాజ్యతంత్రంతో భర్తను చెరసాల నుంచి విముక్తున్ని చేసి చిత్తోర్‌ఘడ్‌కు తీసుకొస్తుంది. దీనిని ఓటమిగా భావించిన అల్లాఉద్దీన్ మేవార్‌పై యుద్ధం ప్రకటిస్తాడు. యుద్ధంలో ఎవరు గెలిచారు? ఆత్మాభిమానానికి ప్రతీకగా అనిపించే రాణిపద్మావతి తన రాజ్యశ్రేయస్సును కాంక్షించి ఎలాంటి త్యాగానికి సిద్ధపడింది? అన్నదే మిగతా చిత్ర కథ.

padmaavat story
padmaavat story

ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భన్సాలీ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించాడు. ఇక సినిమాలో వివాదం రేగేంత‌గా స‌న్నివేశాలు లేనే లేవు. ద‌ర్శ‌కుడు ఎవ‌రి మ‌నోభావాల‌నూ దెబ్బ తీయ‌కుండా సినిమాను తెరకెక్కించాడు. బ‌లమైన ఎమోష‌న్స్‌తో కూడిన క‌థ సినిమాలో లేక‌పోవ‌డంతో కొన్ని స‌న్నివేశాలు స్లోగా సాగుతున్న‌ట్లు అనిపిస్తాయి. రాజ్‌పుత్‌ల వేష‌ధార‌ణ‌, అల్లావుద్ధీన్ లుక్ అన్నీ బాగున్నాయి. ఇక దీనికి త‌గ్గ‌ట్లు మంచి న‌టీన‌ట వ‌ర్గం కూడా దొరికింది. దీపికా ప‌దుకొనే హుందాగా ప‌ద్మావ‌తిగా క‌నిపించింది. ర‌త‌న్ సింగ్‌గా షాహిద్ న‌ట‌న మెచ్చుకోవాల్సిందే. ఇక ఖిల్జీ పాత్ర‌లో న‌టించిన ర‌ణ‌వీర్ సింగ్ న‌ట‌న మిగ‌తా వారంద‌రినీ డామినేట్ చేసింది. ఇక సంజ‌య్ లీలా సంగీతం, నేప‌థ్య సంగీతం ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి.

మొత్తానికి ఈ చిత్రంకి ఉన్న వివాదాలు పక్కన పెట్టి అధ్బుతంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఒకసారి అయినా చూడాల్సిందే..

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Lalu prasad yadav

దోషిగా తేలిన లాలూ, ఐదేళ్ల జైలు శిక్ష

padmaavat story

పద్మావత్ థియేటర్లను తగులబెట్టిన కర్ణిసేన, 144 సెక్షన్‌ విధింపు