in

అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం: ఉత్తరకొరియా

uttara korea -kim

అమెరికా సారథ్యంలో తమపై ఐరాస భద్రతామండలి తమపై విధించిన ఆంక్షలకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తరకొరియాపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ 15 సభ్య దేశాల ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించింది. చమురు దిగుమతితోపాటు ఉత్తరకొరియా నుంచి చేనేత వస్ర్తాల ఎగుమతిపై ఆంక్షలు విధించాలని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని భద్రతామండలి ఆమోదించింది.

వాస్తవంగా చమురు ఉత్పత్తుల దిగుమతిపై పూర్తిస్థాయిలో ఆంక్షలు విధించాలని అమెరికా ప్రతిపాదించినా.. భద్రతామండలిలో శాశ్వత సభ్యదేశాలు రష్యా, చైనా అడ్డుకోవడంతో ఆంక్షల తీవ్రత తగ్గించింది. అణ్వస్ర్తాల తయారీకి ఉత్తరకొరియాకు ముడి చమురు జీవ నాడి అని, 30 శాతం దిగుమతులు మాత్రమే తగ్గించాలన్న తీర్మానంలో ఉన్నా దాని ప్రకారం 55 శాతానికి పైగా గ్యాస్, డీజిల్ దిగుమతిలో కోత విధిస్తామని తెలిపారు. ఈ ఆంక్షలతో అణ్వస్త్ర, క్షిపణి ప్రయోగాల నిర్వహణకు అవసరమైన ఇంధనం, నిధుల సామర్థ్యం తగ్గిపోతాయి. తాజా ఆంక్షలతో ఉత్తర కొరియా నుంచి ఏటా 130 కోట్ల డాలర్ల ఆదాయం తగ్గుతుంది అని ఉత్తరకొరియా రాయబారి హాన్ టాయి సాంగ్ తెలిపారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

RS 100 COIN

రూ 100 నాణెంను విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం

Diabetes and heart disease

షుగ‌ర్‌, గుండె జ‌బ్బుల‌కు ఒక్క మందుతో చెక్