in

హెచ్ఐవీకి మందు రోజూ వేసుకోవాల్సిన పని లేదు, వారానికి ఒకసారి చాలు

HIV capsuls
HIV capsuls

హెచ్‌ఐవీ పేషెంట్లు రోజూ మందులను వేసుకోవాల్సిన అవసరం లేకుండా వారానికి ఒకసారి వేసుకొనే క్యాప్సూల్స్ అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చూడడానికి ఇది సాధారణ క్యాప్సూల్‌లాగే ఉంటుంది కానీ, కడుపులో చేరాక దానిపై ఉన్న కోటింగ్ కరిగిపోయి, వారం రోజుల వ్యవధిలో దాని లోపల నక్షత్ర రూపంలో ఉండే ఔషధం విడుదలౌతుంది. పందులపై నిర్వహించిన ప్రయోగంలో పరిశోధకులు వారం రోజుల పాటు ఉండేలా మూడు యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ – డొల్యూట్‌గ్రావిర్, రిల్పివిరైన్, క్యాబోటెగ్రావిర్ – దాని పొట్టలో ప్రవేశపెట్టారు. ఈ విషయంలో కోతులతో పాటు ఇతర పాలిచ్చే జంతువులపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. అయితే సైంటిస్టులు మాత్రం మరో రెండేళ్లలో మనుషులపై ఈ ప్రయోగాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.

అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకుడు జియోవానీ ట్రావెర్సో, ”ఔషధాన్ని రోజూ కాకుండా కేవలం వారానికోమారు మత్రమే తీసుకునేలా చేయడం వల్ల రోగులకు సౌకర్యవంతంగా ఉంటుంది. భవిష్యత్తులో కొన్ని వ్యాధులకు నెలకోమారు ఔషధం తీసుకునే విధానం కూడా సాధ్యమయ్యే అవకాశం ఉంది” అన్నారు.

టెర్రాన్స్ హిగ్గిన్స్ ట్రస్ట్ ప్రతినిధి, ”హెచ్‌ఐవీతో జీవిస్తున్న పేషెంట్లు రోజూ ఒక మాత్రను వేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలీదు. ఒకవేళ అలాంటివి ఉంటే, ఇలాంటి పరిశోధనలు ఆ ఇబ్బందులను తొలగిస్తే అది మంచిదే. అయితే అలాంటి ప్రత్యామ్నాయాలు ప్రస్తుతం లభిస్తున్న వాటికన్నా తక్కువ ప్రభావవంతంగా మాత్రం ఉండరాదు” అన్నారు.

లిండ్రా అనే సంస్థ రాబోయే 12 నెలల్లో ఇలా దీర్ఘకాలం పాటు ఔషధాన్ని విడుదల చేసే ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని మనుషులలో ప్రయోగించి చూడాలని భావిస్తోంది. ఆ తర్వాత మరికొన్ని జంతువులపై ప్రయోగాలు చేసి, మనుషులపై ప్రయోగాలకు ఆమోదం లభించిన తర్వాత హెచ్‌ఐవీ ఔషధంపై ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

ISRO PSLV C-40

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్‌వీ-సి40

pawan kalyan fans disappointed

పవన్‌ సినిమాలు మానేస్తేనే మంచిది, ఈ అవమాన భారం మేము పడలేము