News

More stories

 • North Korea warns america

  , ,

  అమెరికాకు హెచ్చరికలు పంపిన ఉత్తర కొరియా

  అమెరికా బెదిరింపులకు భయపడేదేలేదంటోంది ఉత్తర కొరియా. తమపై దాడి చేస్తే అగ్ర రాజ్యం పరిస్థితి ఎలా ఉంటుందో.. ఏకంగా ఓ వీడియో తీసి మరీ విడుదల చేసింది. అమెరికాపై అణు బాంబు వేస్తే ఎలా ఉంటుందో, ఎంతటి వినాశనం జరుగుతుందో ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపింది. ఉత్తర కొరియా వ్యవస్ధాపకుడు కిమ్‌ 2 సంగ్‌ గౌరవార్ధం నిర్వహించిన ఓ మ్యూజికల్‌ ఈవెంట్‌  లో ఈ వీడియోను ప్రదర్శించారు. అందులో ఉత్తర కొరియా వదిలిన మిస్సైల్స్‌ దెబ్బకు […]

 • sunrisers hyderabad

  ,

  ఐపీఎల్ 2017: ఢిల్లీపై సన్‌రైజర్స్ విజయం

  ఉప్పల్‌ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో లీగ్‌లో నాలుగో విజయాన్ని సొంతం చేసుకుంది రైజర్స్. సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 192 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ 5 వికెట్లు కోల్పోయి 176 రన్స్ మాత్రమే చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 4 వికెట్లు కోల్పోయి 191 రన్స్ చేసింది. విలియమ్సన్, శిఖర్ ధవన్ అర్ధ సెంచరీలతో చెలరేగారు.

 • Pawan kalyan Janasena selection

  , ,

  జనసేన పార్టీ సైనికుల కోసం అర్హ‌త ప‌రీక్ష

  జ‌న‌సేన కోసం ప‌నిచేసే సైనికులను నియ‌మించుకోవ‌డం కోసం ఉత్సాహ‌వంతులైన యువ‌త నుంచి ఆ పార్టీ అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ద‌ర‌ఖాస్తులు కోరిన విష‌యం తెలిసిందే. ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ‌ ప్ర‌క్రియ ముగియ‌డంతో ఈ రోజు ఆయ‌న దానిపై ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నెల 21 నుంచి అనంత‌పురం జిల్లాలో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల ఎంపిక జ‌ర‌ప‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. అనంత‌పురం జిల్లా నుంచి మొత్తం 3,600 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయని తెలిపారు. త‌మ పార్టీ సైనికుల ఎంపిక కోసం మూడు […]

 • DINAKARAN

  , ,

  పోలీసుల ముందు హాజరుకానున్న దినకరన్

  అన్నాడీఎంకె మాజీ నేత టీటీవీ దినకరన్‌ నేడు, రేపుగానీ పోలీసుల ముందు హాజరుకానున్నాడు. ఆయన నుంచి సరైన సమాధానం రాకుంటే విచారించేందుకు అరెస్ట్ చేసే ఛాన్స్ వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలను గమనించిన దినకరన్, పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరోవైపు దినకరన్ విదేశాలకు పారిపోవచ్చుననే సమాచారంతో ఢిల్లీ పోలీసులు ముందస్తుగా లుక్‌అవుట్ నోటీసు జారీ చేశారు. ఆర్కేనగర్ ఉపఎన్నిక నేపథ్యంలో రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు […]

 • CRPF jawan in jammu

  , ,

  అల్లరిమూకలు వెకిలి చేష్టలపై నోరు విప్పిన జవాన్

  జమ్ములో సిఆర్పీఎఫ్ జవాన్లను అల్లరిమూకలు వెకిలి చేష్టలతో అవమానపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్వయంగా ఆ బాధ అనుభవించిన జవాను విశ్వకర్మ స్పందించారు. ఎన్నికల విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో వారు మాపై దుర్భాషలాడుతూ వెకిలి చేష్టలతో అవమానపరిచినా తాము తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలనుకున్నామని, మమ్మల్ని మేము రక్షించుకుంటూ దేశ ప్రయోజనాలు ఏవిధంగా కాపాడాలో శిక్షణలో బాగా నేర్పించారని చెప్పారు. అందుకే సమన్వయంతో ఆ సమయంలో మౌనంగా ఉన్నామన్నారు. తాము రాళ్లు రువ్వే […]

 • Red beacon cars banned

  , ,

  కేంద్రం సంచలన నిర్ణయం, ఎర్ర బుగ్గ కార్లు నిషేధం

  కేంద్ర ప్రభుత్వం వీఐపీలు ఉపయోగించే ఎర్ర బుగ్గ కార్లపై నిషేధం విధించింది. మే 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. బుధవారం జరిగిన కేబినెట్ మీటింగ్ లో  ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు, హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జీలు, ఐఏఎస్ అధికారులు ఎవ్వరూ ఇకపై బుగ్గ కారులు ఉపయోగించరాదు. కేవలం అత్యవసర సేవల్లో ఉపయోగించే వాహనాలకు, అంబులెన్సులకు మాత్రమే ఎర్రబుగ్గ కారులు ఉపయోగిస్తారు. అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు […]

 • Chris Gayle world record

  ,

  ప్రపంచ రికార్డ్ సృష్టించిన క్రిస్ గేల్

  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో 10వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు తరుపున ఆడుతుండగా గేల్ ఈ ఘనతను సాధించాడు.  ఇంకా మూడు పరుగులు చేస్తే పది వేల పరుగులు పూర్తి చేస్తాడనగా బ్యాటింగ్‌కు దిగిన గేల్ మూడు సింగిల్స్ తీసి ఆ మైలురాయిని చేరుకున్నాడు. టీ20 […]

 • bus falls into tons river

  ,

  నదిలో పడ్డ బస్సు, 46 మంది మృతి

  హిమాచ‌ల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బ‌స్సు అదుపు త‌ప్పి టోన్స్ న‌దిలో ప‌డింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో సుమారు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. సిమ్లా జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయినవారి వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. బస్సులో 56 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తున్నది. ఉత్తరాఖండ్ లోని తియుని వైపుగా బస్సు వెళ్తున్నట్లు సమాచారం. సిమ్లా జిల్లాలోని సెర్వా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

 • petrol diesel rates

  ,

  ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులు బంద్‌

  మే 14 నుంచి 8 రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్‌ పంపులు మూతపడనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి,  మహారాష్ట్ర, హరియాణాల్లోని బంకులను మూసి ఉంచనున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఇటీవల ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో తాము ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు భారత పెట్రోలియం డీలర్ల సంఘం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు సురేశ్‌ కుమార్‌.

 • Vijay Mallya

  ,

  ఇలా అరెస్ట్, అలా బెయిల్… అదిరిందయ్యా మాల్యా

  స్వదేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రుణాలు ఎగవేసి లండన్‌ వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా ఇలా అరెస్టయ్యాడో లేదో అలా బెయిల్ వచ్చేసింది. అరెస్టయిన మూడు గంటల్లోనే కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. విజయ్ మాల్యాను అరెస్టు చేసిన స్కాట్ లండ్ యార్డ్ పోలీసులు ఆయన్ను వెస్ట్ మినిస్టర్ కోర్టులో హాజరుపరిచారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని మాల్యా చేసిన విజ్ఞప్తిని అంగీకరించిన న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. బ్రిటన్ తో భారత్‌ కు నేరస్తుల […]

 • Royal Challengers Bangalore

  ,

  గేల్ వీరవిహారం, ఆర్సీబీ ఘన విజయం

  రాజ్‌కోట్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విక్టరీ కొట్టింది. గుజరాత్ లయన్స్‌పై 21 రన్స్ తేడాతో బెంగళూరు గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీల విధ్వంసంతో.. 2 వికెట్లు కోల్పోయి 213 రన్స్ చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్.. ఆదిలోనే కీలకమైన డ్వేన్ స్మిత్, సురేష్ రైనా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మెక్ కల్లమ్ ఒక్కడే.. దుమ్ముదులిపాడు. 7 వికెట్లు కోల్పోయిన గుజరాత్.. 192 రన్స్ […]

 • nara lokesh slips tongue once again

  , ,

  ఏమైంది లోకేష్ నీకు, ఎందుకీ ఈ తడబాటు

  తూర్పు గోదావరి జిల్లా కరపలో జరిగిన బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ మ‌రోసారి మరోసారి తడబడ్డారు. క‌ర‌ప‌లో ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడుతూ వచ్చే రెండేళ్లలో పల్లెల్లో … త్రాగునీరు లేని ఇబ్బందిని ఏర్పాటు చేయడమే.. తన లక్ష్యమని అన్నారు. నారా లోకేష్ ఇలా చెప్పడంతో కరప వాసులు ఒక్కసారిగా షాక్‌ తిన్నారు. గతంలో కూడా అంబేద్క‌ర్ జ‌యంతిని వ‌ర్థంతి అంటూ వ్యాఖ్యానించి అభాసుపాలు అయిన విషయం తెలిసిందే.