,

ఈ బావ కోరికను తీర్చగలవా..!

Prabhas with mohan babu

బాహుబలి సినిమా తారాగణంపై చిత్ర బృందంపై హీరో మోహన్ బాబు తనదైన శైలి లో ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళిని ,హీరో ప్రభాస్ ను ,సంగీత దర్శకుడు కీరవాణి ని,నిర్మాతలను ,కథ రచయిత విజయేంద్ర ప్రసాద్ ను ట్విట్టర్ వేదికగా కొనియాడారు. ప్రభాస్ ను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేస్తూ ‘బావా బాహుబలి , పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే రాజులూ పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్న గారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. విజయీభవ..అంటూ తన కోరికను చెప్పేసాడు. మరి బాహుబలి ప్రభాస్ తన బావ కోరికను ఎప్పుడు తీర్చుతాడో చూడాలి.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%