, , ,

మా పాపకు టికెట్ ఇస్తావా ఇవ్వవా: జగన్ తో మోహన్ బాబు

Mohan babu- YS jagan - Manchu lakshmi

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కుమార్తె మంచులక్ష్మికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి విన్నవించారట. వివరాల్లోకి వెళ్తే … ఈ మధ్య ఓ సందర్భంలో వరుసకు అల్లుడయిన వైఎస్ జగన్ తో …అల్లుడు మా పాప లక్ష్మి ప్రసన్నకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలి. అది కూడా చంద్రగిరి లేదా శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో ఇవ్వాలని అడిగారట. దీంతో షాక్ కి గురైన వైఎస్ జగన్ ఏమి చెప్పాలో అర్థం కాక నాకు కొద్దిగా సమయం కావాలా మామా, తరువాత చెప్తాను అని ప్రాధేయపడ్డారట.

ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరొకరు శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇద్దరూ జగన్ కి అత్యంత సన్నిహితలు. మరి వారిని కాదని మోహన్ బాబు కూతురికి ఆ నియోజకవర్గాల్లో సీటు ఇవ్వలేరు. దీంతో ఎలక్షన్లకి ఇంకా రెండు సంవత్సరాల కాలం ఉండటంతో మోహన్ బాబు కూతరు భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%