in

నాని ఎంసీఏ మూవీ రివ్యూ, సినిమా ఎలా ఉందటే..!

MCA movie review, talk, story

నాని, సాయి పల్లవి, రాజీవ్ కనకాల మరియు భూమిక ప్రధాన తారాగణంగా , వేణు శ్రీరాం దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన చిత్రం ఎంసీఏ. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. వరుస విజయాలతో ఊపుమీద ఉన్న నాని ఈ చిత్రంతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. మరి సినిమా కథ ఏంటో చూద్దాం..

నాని, రాజీవ్ కనకాల ఇద్దరూ అన్న దమ్ములు. బాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ గడిపేస్తుంటారు. వారి జీవితంలోకి రాజీవ్ భార్యగా భూమిక ఎంటర్ అవుతుంది. దీంతో తనను తన అన్న పట్టించుకోవట్లేదు అన్న భావనలో ఉంటాడు నాని. ఇంట్లో ఆధిపత్యాన్ని మొత్తం లాక్కున్న భూమిక ను చూసి నాని కొన్ని సార్లు ఆమెతో గొడవ పడతాడు. ఇదిలా ఉండగా, భూమిక కు వరంగల్ లో ఆర్టివో గా పోస్టింగ్ వస్తుంది. అలాగే రాజీవ్ ఢిల్లీ కి ట్రైనింగ్ నిమిత్తం వెళతాడు. రాజీవ్ కోరిక మేరకు వరంగల్ లో ఉన్న భూమిక యోగ క్షేమాలు నాని చూస్తుంటాడు. కాగా, ఇంజనీరింగ్ చేస్తున్న పల్లవి నాని తో తొలి చూపులోనే ప్రేమలో పడుతుంది. ట్రాన్స్పోర్ట్ మాఫియా నడిపిస్తున్న శివ భూమికను దక్కించుకోవాలని చూస్తాడు. నాని భూమికను వారి నుండి ఎలా కాపాడతాడు అన్నదే మిగతా కథ.

మధ్య తరగతి కుర్రడుగా నాని తన నటనతో ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి నటన కూడా బాగుంది.చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన భూమిక నటన ఈ సినిమాకే హైలైట్. నాని వదిన పాత్రలో ఒదిగిపోయింది. నూతనంగా పరిచమయిన విలన్ పాత్రధారి విజయ్ ఆకట్టుకున్నాడు. రాజీవ్ కనకాల, ప్రియదర్శిని, నరేష్, శుభలేఖ, సుధాకర్, పవిత్ర లోకేష్ కూడా వారి వారి నటనలో ఒదిగిపోయారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫి బాగుంది.

చివరిగా సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం రొటీన్ సన్నివేశాలతో ఇబ్బంది పెట్టిన సినిమా మొత్తానికి పరవలేదనిపినిస్తుంది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Alia bhatt Gym workout

16 కిలోల బ‌రువు త‌గ్గిన అలియా భ‌ట్, ఈ షాకింగ్ వీడియో చూడండి

Actress Parvathy

మరో మళయాల నటిపై లైంగిక వేధింపులు