in ,

పవన్, చిరంజీవిలపై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్

mahesh kathi fires on pawan kalyan, pawan fans

పవన్ అభిమానులకు మాత్రమే శత్రువుగా మారిన మహేష్ ఈసారి తన రూట్ మార్చి ఏకంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ పై, అలాగే చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేసారు. అన్నయ్య చిరింజీవిని మోసం చేసిన వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని, అలాంటి ఉన్నతమైన వ్యక్తిని మోసగించిన వాళ్లకు తగిన బుద్ధి చెప్పేలా యువత అంతా పని చేయాలని పవన్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కత్తి మహేష్ వారికి కౌంటర్ గా ఈ సంచలన వ్యాఖ్యలు చేసారు.

‘అన్నను, పి.ఆర్.పి.ని మోసం చేసినవాళ్ల సంగతి సరే, మరి అన్న గారు జనానికి, కులానికి, పార్టీకి చేసిన మోసం సంగతో’ అంటూ కత్తి మహేష్ తన ఫేస్ బుక్ లో కామెంట్స్ పెట్టారు. పవన్ కళ్యాణ్ పర్యటన పై ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా ఆడియో ఫంక్షన్ సినిమా త్వరలోనే విడుదల ఉంది. కాబట్టి ‘ఏక్ పంత్ దో కాజ్’ అంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు లాగా అటు రాజకీయపరంగా లాభముంటుంది, ఇటు సినిమా పరంగా ప్రమోషన్ జరిగిపోతుంది అనీ అందుకే పవర్ స్టార్ వైజాగ్ చేరుకున్నారు అంటూ ఎద్దేవా చేసారు. ఉన్న తక్కువ సమయంలోనే రాజకీయంగానూ, సినిమా పరంగాను పనికొచ్చే పని చేస్తుంటే అంతకన్నా ఏం కావాలి? ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ జనం లోకి వెళ్లాడని దీని వల్ల రెండు రకాలుగా లబ్ది పొందుతున్నడు అని చెప్పుకొచ్చారు

అంతేకాదు పార్టీ ఆఫీసుని సినిమా ఆఫీసులా ప్రజా ప్రస్థానాన్ని ఆడియో లాంచ్ లాగా మార్చడమే కొత్త తరహా రాజకీయం అంటూ పవన్‌ పై కత్తి మహేష్ వేసిన చురకలు మరోరకమైన కొత్త చర్చలకు తెర తీస్తున్నాయి. మరీ కత్తి మహేష్ వ్యాఖ్యలపై ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Airtel 4G Phone - Intex

ఎయిర్‌టెల్ మరో కొత్త 4జీ ఫోన్ రూ.1649కే

Nagarjuna - akhil hello movie

నంది అవార్డులపై స్పందించిన నాగార్జున