in ,

అమ్మ ఇక లేరు, శోకసముద్రంలో తమిళ ప్రజలు

Jayalalithaa died

ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 74 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తుదిశ్వాస విడిచారు. గత సెప్టెంబరు 22వ తేదీ నుంచి చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన జయలలిత… ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి గుండెపోటు వచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఆమెకు అత్యున్నత వైద్య బృందం ఎక్మో విధానంతో చికిత్స అందించారు. అయితే, ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

తమిళనాట ప్రతి మనసులో అమ్మగా ముద్ర వేసుకున్న పురచ్చితలైవి, తమిళనాడు ముఖ్యమంత్రి జయరామన్ జయలలిత సోమవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూసినట్లుగా ఆమెకు చికిత్సను అందిస్తున్న అపోలో యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఎన్నో పథకాలతో పేదోడి కన్నీళ్లను తుడిచిన అమ్మ మృతిచెందారన్న వార్తని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అమ్మ ఆరోగ్యంగా తిరిగిరావాలని గత రెండు నెలలకుపైగా వారు చేసిన ప్రార్థనలు ఫలించలేదు.

 

 

 

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Nanna Nenu Naa Boyfriends

నాన్న‌, నేను నా బాయ్ ఫ్రెండ్స్ ట్రైలర్

Jayalalithaa - Apollo hospital

అపోలో ఆస్పత్రిపై దాడి చేసిన అమ్మ అభిమానులు