in

జై సింహా మూవీ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే..!

Jai simha review,talk, story
Jai simha review,talk, story

నందమూరి బాలకృష్ణ హీరోగా.. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జై సింహా’ భారీ అంచనాలతో ఈ రోజు మనముందుకు వచ్చింది. నయనతార, హరిప్రియ, ప్రకాశ్ రాజ్, నటాషా దోషీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కేయస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. గతేడాది శాతకర్ణితో విజయం సాధించిన బాలయ్య ఈ సారి కూడా సంక్రాంతికి కూడా హిట్ కొట్టాలని కసితో వస్తున్నారు. మరి చిత్రం ఎలాఉందో .. అసలు కథ ఏంటో చూద్దాం..

కథ విషయానికి వస్తే … నరసింహం(బాలకృష్ణ) ఏడాది వయసున్న కొడుకుతో బతుకుతెరువు కోసం తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ ఓ గుడి ధర‍్మకర్త మురళీ కృష్ణ (మురళీమోహన్) ఇంట్లో డ్రైవర్‌గా పనిలోచేరతాడు. అక్కడి లోకల్ రౌడీ కనియప్పన్‌ (కాళకేయ ప్రభాకర్) తమ్ముడికి మురళీ కృష్ణ కూతురు కారణంగా యాక్సిడెంట్ అవుతుంది. మురళీ కృష్ణ కోసం ఆ నేరాన్ని తన మీద వేసుకొని కనియప్పన్ చేతిలో దెబ్బలో తింటాడు నరసింహం. అదే సమయంలో కొత్తగా వచ్చిన ఏసీపీతోనూ నరసింహానికి గొడవ అవుతుంది.

ఈ గొడవల్లో తన కొడుకుకు ఏమన్నా అవుతుందన్న భయంతో ఊరొదిలి వెళ్లిపోవాలనుకుంటాడు.కానీ అదే సమయంలో తన కొడుకు లాగే ఉండే మరో అబ్బాయిని కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేయటంతో తన కొడుకే అనుకొని ఆ అబ్బాయి కాపాడతాడు. అసలు కనియప్పన్ మనుషులు కిడ్నాప్ చేసిన బాబు ఎవరు..? ఆ బాబు నరసింహం కొడుకులాగే ఎందుకు ఉన్నాడు..? నరసింహం భార్య ఏమైంది..?

జై సింహాతో మరోసారి తన ఇమేజ్ తగ్గ క్యారెక్టర్ తో అభిమానులను అలరించాడు బాలకృష్ణ. తన మార్క్ పంచ్ డైలాగ్ లు, మాస్ ఎలిమెంట్స్ తో అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. అదే సమయంలో ఎమోషనల్, సెంటిమెంట్ సీన్స్ తోనూ ఆకట్టుకున్నాడు. అమ్మకుట్టి పాటలో బాలయ్య డాన్స్‌లు అభిమానులను ఖుషీ చేస్తాయి. బాలయ్య జోడిగా నయనతార మరోసారి సూపర్బ్ అనిపించింది. ఏ మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లకుండా రొటీన్ ఫార్ములాతో సినిమా తెరకెక్కించిన దర్శకుడు అభిమానులను సంతృప్తి పరిచినా.. కొత్తదనాన్ని ఆశిం‍చే ఆడియన్స్‌ను మాత్రం ఆ స్థాయిలో లేదని చెప్పవచ్చు. ఎం.రత్నం డైలాగ్స్ సినిమాకు ప్లస్ పాయింట్, బాలయ్య పవర్ కు తగ్గ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టేసాడు. చిరంతన్ భట్ సంగీతం బాగుంది.

మొత్తానికి జైసింహతో బాల్యా అభిమానులకు ఒకరోజు ముందే సంక్రాంతి పండగ తీసుకొచ్చారు. జైసింహ పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళుతోంది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

pawan kalyan fans disappointed

పవన్‌ సినిమాలు మానేస్తేనే మంచిది, ఈ అవమాన భారం మేము పడలేము

taiwan wife

ఏడాదిగా స్నానం చేయని భార్య, విడాకులు కోసం భర్త