in

అదిరిపోయే ఫీచర్లతో ఐఫోన్ X, ఐఫోన్‌ 8 మరియు ఐఫోన్‌ 8 ప్లస్

iPhone X -m iPhone 8 - iPhone 8 plus

ఆపిల్ ఐఫోన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా మూడు ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ‘ఐఫోన్‌ ఎక్స్‌ (ఐఫోన్‌ 10)’ పేరిట తన తాజా సంచలనాన్ని మార్కెట్‌కు పరిచయం చేసింది. వీటితో పాటు ఐఫోన్‌8, ఐఫోన్‌8 ప్లస్‌ పేరిట మరో రెండు మోడళ్లను కూడా విడుదల చేసింది. ఐఫోన్‌ 8 మోడళ్లు రెండూ సిల్వర్‌, స్పేస్‌ గ్రే రంగులతోపాటు.. కొత్తగా గోల్డ్‌ కలర్‌లో కూడా లభ్యమవుతాయి.

ఒకసారి వీటి ఫీచర్లను చూస్తే…

ఐఫోన్‌ ఎక్స్‌(ఐఫోన్‌ 10): 
ఐఫోన్‌ టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ ఫోన్‌.. యాపిల్‌ ఇప్పటిదాకా విడుదల చేసినవాటన్నిటిలోకీ మెరుగైనది. 5.8 అంగుళాల సూపర్‌ రెటీనా OLED డిస్‌ప్లే తెర, డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ దీని ప్రత్యేకతలు. ఫుల్‌ స్ర్కీన్‌ డిస్‌ప్లే ఉంటుంది.3 డి స్కానర్లు,3సెన్సార్లు గత మోడళ్లలో లేని ప్రత్యేకత ఇందులో ఉన్నాయి. ఇప్పటి వరకు ఫోన్లను అన్ లాక్ చేయాలంటే చేతి వేలిముద్ర లేదా.. బటన్ వినియోగించేవారు. ఐఫోన్ టెన్ లో మాత్రం యజమాని ఫోన్ ను తన ముఖానికి ఎదురుగా ఉంచుకుని..కళ్లతో చూస్తే చాలు అన్ లాక్ అవుతుంది. అంటే వినియోగదారుడి ముఖాన్ని గుర్తించే ఫేస్‌ ఐడీ పరిజ్ఞానం ఇందులో స్పెషల్. వైర్ లెస్ ఛార్జింగ్ కూడా దీని ప్రత్యేకతే.12 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరాలు,64GB నుంచి ప్రారంభమయ్యే ఐఫోన్ 10 ధర రూ.63 వేల పైమాటే. పన్నులు కలుపుకొంటే చాలా ఎక్కువ ఉంటుంది.

ఐఫోన్‌ 8+ ఫీచర్స్: 5.5 అంగుళాల స్క్రీన్, వైడ్‌యాంగిల్‌ లెన్స్‌, టెలిఫొటో లెన్స్‌తో కూడిన 12-మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ కెమెరా దీని ప్రత్యేకతలు. దీంట్లో ఉండే పోర్ట్రయిట్‌ లైటింగ్‌ అనే ఫీచర్‌.. పోర్ట్రయిట్‌ మోడ్‌లో ఫొటోలు తీస్తున్నప్పుడు అక్కడి వాతావరణానికి అనుగుణంగా వెలుగును సరిచేస్తుంది. 64GB, 256 GB వేరియంట్లలో లభించనుంది. వీటి ధరలు రూ.51 వేల నుంచి మొదలవుతుంది. మనదేశంలో పన్నులన్నీ కలుపుకొంటే ధర భారీగానే ఉండనుంది.

ఐఫోన్‌ 8 ఫీచర్స్: 4.7 అంగుళాల స్క్రీన్, వెనకవైపు 12 మెగాపిక్సెల్‌ కెమెరా. 1080పి హెచ్‌డీ నాణ్యతతో స్లోమోషన్‌ వీడియోలను, 4కే వీడియోలను దీంతో తీయవచ్చు. దీంట్లో ఏ11 బయోనిక్‌ చిప్‌.. ఇప్పటిదాకా వచ్చిన స్మార్ట్‌ఫోన్లలో ఉన్న అన్నింటికన్నా అత్యంత శక్తిమంతమైనదని యాపిల్‌ చెబుతోంది. వైర్‌లెస్‌ చార్జింగ్‌ సదుపాయం ఉంది. 64GB కలిగిన ఈ ఫోన్ ధర రూ.45 వేల నుంచి మొదలవుతుంది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Sasikala out from AIADMK

శశికళకు భారీ షాక్, అన్నాడీఎంకే నుంచి తొలగింపు

inter student girl murder

ప్రియుడే హంతకుడు, వీడిన చాందినీ డెత్ మిస్ట‌రీ