in

మూడో వన్డేలో భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం

india beat australia in third ODI

 

సొంతగడ్డపై టీమిండియా ఎదురులేకుండా దూసుకుపోతోంది. మూడో వన్డేలోనూ ఆసీస్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరో రెండు మ్యాచ్ లు మిగిలుండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోహ్లీ సేన ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఆసీస్‌ నిర్దేశించిన 294 పరుగుల లక్ష్యాన్ని 47.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. తొలుత స్మిత్‌సేన నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 293 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఆరోన్‌ ఫించ్‌ (125 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 124) శతకంతో చెల రేగినా… కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (63) హాఫ్‌ సెంచరీతో రాణించి నా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్‌ చెరో రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు.

హార్దిక్‌ పాండ్యా (72 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 78) ధనాధన్‌ బ్యాటింగ్‌కు రోహిత్‌ శర్మ (62 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 71), రహానె (76 బంతుల్లో 9 ఫోర్లతో 70) మెరుపులు తోడవడంతో ఆదివారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా మరో 14 బంతులు మిగిలుండగానే ఐదు వికెట్లతో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది.

స్కోరు బోర్డు
ఆస్ట్రేలియా: వార్నర్‌ (బి) పాండ్యా 42, ఫించ్‌ (సి) కేదార్‌ (బి) కుల్దీప్‌ 124, స్మిత్‌ (సి) బుమ్రా (బి) కుల్దీప్‌ 63, మాక్స్‌వెల్‌ (స్టంప్డ్‌) ధోనీ (బి) చాహల్‌ 5, హెడ్‌ (బి) బుమ్రా 4, స్టొయినిస్‌ (నాటౌట్‌) 27, హ్యాండ్స్‌కోంబ్‌ (సి) మనీష్‌ (బి) బుమ్రా 3, అగర్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 50 ఓవర్లలో 293/6;

వికెట్ల పతనం: 1-70, 2-224, 3-243, 4-243, 5-260, 6-275; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 10-0-52-0, బుమ్రా 10-0-52-2, చాహల్‌ 10-0-54-1, హార్దిక్‌ 10-0-58-1, కుల్దీప్‌ 10-0-75-2.

భారత్‌: రహానె (ఎల్బీ) కమిన్స్‌ 70, రోహిత్‌ (సి) సబ్‌/కార్ట్‌రైట్‌ (బి) కల్టర్‌ నైల్‌ 71, కోహ్లీ (సి) ఫించ్‌ (బి) అగర్‌ 28, హార్దిక్‌ (సి) రిచర్డ్‌సన్‌ (బి) కమిన్స్‌ 78, కేదార్‌ (సి) హ్యాండ్స్‌కోంబ్‌ (బి) రిచర్డ్‌సన్‌ 2, మనీష్‌ (నాటౌట్‌) 36, ధోనీ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 47.5 ఓవర్లలో 294/5;

వికెట్ల పతనం: 1-139, 2-147, 3-203, 4-206, 5-284; బౌలింగ్‌: కమిన్స్‌ 10-0-54-2, కల్టర్‌ నైల్‌ 10-0-58-1, రిచర్డ్‌సన్‌ 8.5-0-45-0, స్టొయినిస్‌ 8-0-61-0, ఆస్టన్‌ అగర్‌ 10-0-71-1, మాక్స్‌వెల్‌ 1-0-2-0.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

sada sayid

పేరు మార్చుకున్న సదా, ఇకపై అలానే పిలవాలంట

Micromax Selfie 3

మంచి ఫీచర్లతో మైక్రోమ్యాక్స్‌ సెల్ఫీ 3 స్మార్ట్ ఫోన్ విడుదల