in

మరో తిరుమలగా చెప్పుకొనే యాదాద్రిలో ఏంటీ ఈ పాడుప‌నులు

illegal activities in yadadri

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను మరో తిరుమలగా మారుస్తానని ఎన్నోసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే అక్క‌డ కోట్లాది రూపాయ‌ల‌తో అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తుండ‌డంతో పాటు ఆ దిశ‌గా ఇప్ప‌టికే కొన్ని అభివృద్ధి ప‌నులు కూడా ప్రభుత్వం చేపట్టింది.

ఇదిలా ఉంటే యాదగిరిగుట్టలో జ‌రుగుతున్న అసాంఘీక కార్య‌క‌లాపాలు ఇప్పుడు ఆ ప‌విత్ర పుణ్య‌క్షేత్రం పేరును నాశ‌నం చేస్తున్నాయి. దాదాపు దశాబ్ద కాలంగా యాదగిరిగుట్టలో వ్యభిచార వృత్తిలో మగ్గుతున్న చీకటి జీవితాలు ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఇక్క‌డ వంద‌ల కుటుంబాలు వ్యభిచార వృత్తిలో ఉండ‌డంతో ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన యాదాద్రికి పెద్ద మాయ‌ని మ‌చ్ఛ‌లాగా మారింది. ఇక్క‌డ ప్ర‌భుత్వాలు వారిని ఆదుకోక‌పోవ‌డంతో వారు వేరే ఉపాధి అవ‌కాశాలు లేక ఆ వృత్తిలోనే వార‌స‌త్వంగా కొన‌సాగుతున్నాయి.

ఓ 26 సంవత్సరాల బాధితురాలు మాట్లాడుతూ ” నా తల్లి కూడా ఈ వృత్తిలోనే కొనసాగుతోంది. ఆమె ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె కూతురిగా నాకు ఎవరూ ఏ పని ఇవ్వడం లేదు. చివరికి గత్యంతరం లేక నేనూ ఈ చీకట్లోకే రావాల్సొచ్చింది. అమ్మ అనారోగ్యం నుంచి బయటపడటానికి… అప్పులు తీర్చడానికి నాకు ఇదొక్కటే దారి. ఈ వృత్తిలోంచి బయటకు వచ్చి కష్టపడి పనిచేసుకుని బతకడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మమ్మల్ని మనుషులుగా ఎవరూ భావించడం లేదు. నీచంగా చూస్తున్నారు. వీలైనన్ని విధాలుగా అవమానిస్తున్నార‌ని ఆమె వాపోయింది.”

అయితే వీరిపై పోలీసులు ప‌దే ప‌దే దాడులు చేసి వీరిని అరెస్టు చేస్తున్నారు. అయినా వీరిలో మార్పు రావ‌డం లేదు. ఇక ప్ర‌భుత్వం త‌మ‌ను ఆదుకోవాల‌ని వీరు ఎన్నిసార్లు వీరు మొరపెట్టుకుంటున్నా ప్రభుత్వం మాత్రం వీరిని ప‌ట్టించుకోవ‌డం లేదు.

What do you think?

-1 points
Upvote Downvote

Total votes: 1

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 1

Downvotes percentage: 100.000000%

TRS operation akarsh

టీడీపీ నుండి టీఆర్ఎస్ లోకి సినీనటి

balakrishna-talks-about-his-wife-Vasundhara

భార్య వ‌సుంధ‌ర‌పై బాల‌య్య ఏమన్నాడంటే