in

దారుణం: భార్య కాపురానికి రాలేదని ఎలా చితకబాదుతున్నారో ఈ వీడియో చూడండి

husband beating wife - viral video

మైనర్ బాలికను బలవంతంగా పెళ్లాడటమే కాకుండా ఆమె కాపురానికి రాలేదని ఆమెను, ఆమె తల్లిని చితకబాది, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే … జోధ్‌పూర్ జిల్లాలోని బ‌ప్ తెహ‌సిల్ గ్రామానికి చెందిన అహ్మ‌ద్ ఖాన్ త‌న కుమార్తెను ఢాణీ గ్రామానికి చెందిన షౌక‌త్‌కు ఇచ్చి ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం నాటికి ఆమెకు 16 సంవత్సరాలే. ఆ బాలిక‌కు, ఆమె త‌ల్లికి ఈ పెళ్లి ఏ మాత్రం ఇష్టం లేదు. దీనితో పెళ్ల‌యిన ఆరు నెల‌ల‌కే ఆ బాలిక పుట్టింటికి వ‌చ్చింది. అక్క‌డే ఉండి చ‌దువుకుంటోంది. త‌న భార్య‌ను కాపురానికి పంపించాలంటూ షౌక‌త్ ప‌లుమార్లు ఆమె త‌ల్లి నేమ్తా ఖాన్‌కు సూచించాడు.

అయితే ఆ బాలిక చదువుకోవడానికి మొగ్గు చూపడంతో … ఆమె వైఖ‌రి న‌చ్చ‌ని షౌక‌త్‌..రెండు రోజుల కింద‌ట త‌న స్నేహితుడితో క‌లిసి ట్రాక్ట‌ర్‌పై నేమ్తా ఖాన్ గ్రామానికి వెళ్లాడు. ఆ స‌మ‌యంలో నేమ్తా ఖాన్‌తో పాటు ఆమె కుమార్తె వ్య‌వ‌సాయ ప‌నుల్లో ఉన్నారు. నేరుగా పొలం వ‌ద్ద‌కు వెళ్లిన షౌక‌త్ అక్క‌డే వారితో గొడ‌వ ప‌డ్డాడు. త‌న భార్య జుట్టుప‌ట్టుకుని లాక్కుని వెళ్లాడు. అడ్డొచ్చిన నేమ్తాను తీవ్రంగా కొట్టాడు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ షాకింగ్ వీడియో వైరల్ అయ్యింది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Rohingya militants killed people

రోహింగ్యాల అకృత్యాలు, గుట్టలుగుట్టలుగా శవాలు

Ben Stokes fighting video footage

ఇంగ్లండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్ రౌడీయిజం వీడియో లీక్