in

హలో మూవీ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే..!

Akhil Hello movie review

అఖిల్‌, కల్యాణి ప్రియదర్శన్‌, జగపతిబాబు, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన తారాగణంగా విక్రం కుమార్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన చిత్రం ‘హలో’. మనం వంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం వస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి సినిమా కథ ఏంటో తెలుసుకుందాం…

శ్రీను(అఖిల్‌) ఓ అనాధ. శ్రీనుకి… ప్రియ (కల్యాణి ప్రియదర్శన్‌) పరిచయం అవుతుంది..ఇద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. ప్రియతో కలిసి ఆడుకోవడం, తినడం చేస్తూ అనాధ అనే ఫీలింగ్ మరచిపోతాడు. శీను సంగీతం అంటే ప్రియకి ఎంతో ఇష్టం. ఇదే టైం లో ప్రియ తండ్రి (అనీష్ కురువిల్లా)కి ఢిల్లీ ట్రాన్స్‌ఫర్ కావడంతో ఆమె ఢిల్లీ వెళ్ళిపోతుంది. వెళ్లే టైం లో ఓ వంద కాగితం ఫై తన ఫోన్ రాసి వెళ్తుంది. కానీ ఆ వంద కాగితం ఎక్కడో మిస్ అవుతుంది. అదే సమయం లో శ్రీను ప్రకాష్‌(జగపతిబాబు), సరోజిని(రమ్యకృష్ణ)లకు పరిచయం అవుతారు. వారు శ్రీను కు అవినాష్ అని పేరు పెట్టి పెద్ద చేస్తారు. కానీ శ్రీను మాత్రం తాను చిన్నప్పుడు ప్రియ ను కలుసుకునే ప్లేస్ కు వెళ్లి చూస్తుంటాడు. ఆ సమయం లో శ్రీను కు ఓ ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ మాట్లాడుతున్న సమయం లో వయోలిన్ ట్యూన్ వినపడుతుంది. అది చిన్నప్పుడు తను ప్రియతో కలిసి ప్లే చేసిన ట్యూన్‌ని పసిగట్టిన శ్రీను ఆ అడ్రెస్ ఎక్కడ అని అడిగేలోపు తన ఫోన్ ను కొంతమంది లాక్కుని పారిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది. ప్రియ ను శ్రీను ఎలా కలుసుకుంటాడు అనేదే కథ.

అఖిల్ నటన బాగుంది. డాన్స్ , ఫైట్స్ , సెంటిమెంట్ లలో అద్భుతంగా చేసాడు. హీరోయిన్ కల్యాణి కి తెలుగు లో ఫస్ట్ సినిమా అయినప్పటికీ చాలా సహజంగా నటించింది. జగపతిబాబు, రమ్యకృష్ణ, అనీష్ కురువిల్లా, సత్యకృష్ణ, వెన్నెలకిషోర్‌, అజయ్, కృష్ణుడు తదితరులు వారి వారి పాత్రలకు తగట్టు నటించారు. అనూప్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ , కథ కు తగ్గట్టు మెలోడీ ట్యూన్లు బాగా వర్క్ అవుట్ అయ్యాయి.

విక్రమ్ కె.కుమార్‌ కొత్త కథే ఏమి రాసుకోలేదు..చిన్నప్పుడు విడిపోవడం , పెద్దయ్యాక కలుసుకోవడం..అనేదే చూపించాడు. ఫస్ట్ హాఫ్ లో చిన్నప్పటి ఎపిసోడ్‌ను విభిన్నంగా తీర్చిదిద్దాడు. విడిపోయిన శీను, ప్రియ లు ఒక ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నారని తెలిసేలోపే కథలో కీలక మలుపు చేసుకోవడం , ఆ తర్వాత వారు ఎలా కలుస్తారు..అనేది ఆసక్తిగా తీర్చిదిద్దాడు. కొత్త కథ కోసం కాకుండా పాత కథనే ఎంచుకొని అందులో యాక్షన్ ను జోడించి డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మొత్తానికి ఈ చిత్రం ఓ ఎమోషనల్ ప్రేమ కథగా చెప్పుకోవచ్చు.

Loading...

What do you think?

-2 points
Upvote Downvote

Total votes: 2

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 2

Downvotes percentage: 100.000000%

Jai Simha Teaser

జై సింహా టీజర్ అదిరిపోయింది

rajamouli prabhas

ఫోర్బ్స్ జాబితాలో రాజమౌళి, ప్రభాస్