,

మధ్యాహ్నం నిద్రిస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

sleeping benefits

సీనియర్‌ సిటిజన్స్‌ మధ్యాహ్నం భోజనానంతరం ఒక గంటసేపు నిద్రపోవటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయట. ఇలా చేయడంవల్ల వారి జ్ఞాపకాలు పదిలంగా ఉండటమే కాదు ఏ నిర్ణయాలనైనా వేగంగా తీసుకోగలుగుతారట. పెద్దవాళ్లయ్యే కొద్దీ రకరకాల విషయాలు వారిని ఆందోళనపరుస్తుంటాయి. నిద్రవల్ల ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చంటున్నారు ఫిలడెల్ఫియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన శాస్త్రవేత్తలు.

ఈ పరిశోధనలో చైనాకు చెందిన 65 సంవత్సరాలు నిండిన సీనియర్‌ సిటిజన్స్‌ను పరీక్షించారు. దీనిలో భాగంగా మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రపోతున్నారా? ఎంతసేపు నిద్రపోతున్నారు? ఈ అలవాటు వల్ల మెంటల్‌ హెల్త్‌ ఎలా ఉంది? వంటి ప్రశ్నలు వేశారు. వీరిలో 60 శాతం మంది సీనియర్‌ సిటిజన్స్‌ లంచ్‌ తర్వాత పడుకుంటామని చెప్పారు. అరగంట నుంచి గంటన్నర సమయం నిద్రపోతున్నామన్నారు. చాలామంది 63 నిమిషాల పాటు కునుకు తీస్తున్నామని తెలిపారు. ఈ పరిశోధనలో అస్సలు పడుకోని వారి కంటే రోజూ లంచ్‌ తర్వాత గంటపైన పడుకున్న సీనియర్‌ సిటిజన్స్‌ ఆరోగ్యం బాగుంటోందని వెల్లడైంది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%