in

అందరిపైనా ప్రతీకారం తీర్చుకుంటా: హార్దిక్‌ పాండ్యా

hardik pandya birthday celebrations

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన పుట్టిన రోజు (అక్టోబర్‌ 11) సందర్భంగా సహచర ఆటగాళ్లతో పాండ్యా కేక్‌ కట్‌చేశాడు. ఆ కేకును సహచర ఆటగాళ్లు పాండ్యాకు తినిపించడం కంటే ఒంటికి పూయడానికే ఎక్కువగా ఉపయోగించారు. దాదాపు కేకులో ముంచెత్తారు. యువ స్పిన్నర్‌ యుజవేంద్ర చాహాల్‌, మనీష్‌ పాండే మరియు అక్సర్‌ పటేల్‌లు పాండ్యాను కొడుతూ మరి కేకు రుద్దారు. ఇక ప్రతిదీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసే పాండ్యా ఈ వీడియోను సైతం అభిమానులతో పంచుకున్నాడు. “ప్రతి ఏడాది ప్రతి ఒక్కరి బర్త్‌డే వస్తుంది.. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటా” అనే క్యాఫ్షన్‌తో పోస్టు చేశాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో చక్కెర్లు కొడుతుంది.

ఈ మధ్యకాలంలో పాండ్యా మెరుగైన ప్రదర్శనతో ప్రశంసలందుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ 4-1 గెలవడంలో కీలకపాత్ర పొషించి తొలి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అందుకున్నాడు. ఈ సిరీస్‌లో చెన్నై, ఇండోర్‌ వేదికల్లో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడిన పాండ్యా 222 పరుగులు చేసి, 6 వికెట్లు పడగొట్టాడు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

singer Harshita Dahiya

వర్ధమాన గాయని దారుణ హత్య

Simran Diwali Wishes with a Special Message

దీపావళికి సిమ్రన్‌ సందేశం, ప్రతి ఒక్కరు పాటిద్దాం