in

తప్పతాగి పోలీసులపై చిందులేసిన అమ్మాయి

drunk woman

నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా జరుగుతున్నా మందు బాబుల తీరు మారడం లేదు. తప్పతాగి పోలీసుల తనిఖీల్లో అడ్డంగా బుక్కవుతున్నారు. ఇక్కడ కొసమెరుపేంటంటే.. యువకులతో పాటు యువతులు కూడా మద్యం సేవించి డ్రైవ్ చేస్తూ.. బ్రీత్ ఎనలైజింగ్ టెస్ట్‌కు సహకరించకుండా నానా రచ్చ చేస్తున్నారు. శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఇద్దరు యువతులు హల్‌చల్ చేశారు.

వీళ్లలో ఓ యువతి చేసిన హడావుడి అంతాఇంతా కాదు. తాగి డ్రైవ్ చేయడం తప్పని తెలిసినా ఆ తప్పు చేసి ఆమె చేస్తున్న హంగామాను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిపై చిందులేసింది. కెమెరాలు లాక్కునే ప్రయత్నం చేసింది. టీఎస్ 07 ఎఫ్‌వీ 3737 కారులో తాగి డ్రైవ్ చేస్తున్న ప్రియాంక అనే ఈ యువతి పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగింది. నోటికొచ్చినట్లు పోలీసులను తిడుతూ నానా హడావుడి చేసింది. పోలీసులు ఆ యువతి కారును సీజ్ చేశారు. కారులో మద్యం బాటిళ్లు లభించాయి. మరోవైపు రోషన్ అనే విద్యార్థి కూడా తన గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించి కారు నడుపుతూ అడ్డంగా బుక్కయ్యాడు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

తొలి ప్రేమ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

Hardik Pandya - Elli Avram

హార్దిక్ పాండ్యాతో డేటింగ్ పై బాలీవుడ్ హీరోయిన్ స్పందన..!