,

డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ సినీనటులు

Drunken Drive in Hyderabad

వీకెండ్‌ సందర్భంగా శనివారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు హైదరాబాద్‌ లోని 18 చోట్ల డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రంకెన్‌ డ్రైవ్‌లో ఇద్దరు సినీ నటులు పరిమితికి మించి మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. మాదాపూర్‌లో ఓ పార్టీకి హాజరై ఫిలింనగర్‌కు వెళుతున్న కాయ్‌ రాజా కాయ్‌ సినిమా ఫేం సాయి రోహిత్ హుందాయ్‌ కారులో వస్తుండగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 36లో ట్రాఫిక్‌ పోలీసులు ఆపి బ్రీత్ ఎనలైజర్‌ పరీక్ష చేశారు. మద్యం తాగి కారు నడుపుతున్నట్టు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి కారును సీజ్‌ చేశారు. అటు జూబ్లీహిల్స్‌ పరిధిలోని పబ్బులు, హుక్కా సెంటర్లపై అర్ధరాత్రి పోలీసులు దాడులు చేశారు.

జూబ్లీహిల్స్‌ నుంచి బంజారాహిల్స్‌ వైపు వెళుతున్న రాజమహల్‌ ఫేం సూర్యనాథ్‌ బీఎండబ్ల్యూ కారును వీఎల్‌సీసీ వద్ద పోలీసులు ఆపి బ్రీత్ ఎనలైజర్‌ పరీక్ష చేశారు. పరిమితికి మించి మద్యం తాగినట్టు నిర్ధారణ కావడంతో కేసు నమోదుచేసి కారును సీజ్‌ చేశారు. సూర్యనాథ్‌ ఇప్పటికే డ్రంకెన్‌ డ్రైవ్‌లో మూడుసార్లు పట్టు బడ్డాడని అతడిపై చార్జిషీటు దాఖలు చేసి క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ నిర్వహించనున్నట్టు పంజాగుట్ట ట్రాఫిక్‌ ఏసీపీ మాసూం బాషా తెలిపారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%