in

మరి కాసేపట్లో అరుషి హత్య కేసులో కోర్టు తీర్పు

Aarushi talwar murder case

దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన ఆరుషి హత్యకేసు పై అలహాబాద్ హై కోర్టు డివిజన్ బెంచ్ తీర్పు మరి కాసేపట్లో వెలువడనుంది. అప్పట్లో ఈ కేసు  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు వివరాల్లోకి వెళ్తే 2008లో ఢిల్లీలోని నోయిడాలో 14 ఏళ్ళ బాలిక ఆరుషి తల్వార్ హత్యకు గురైంది. సర్జికల్ ఉపకరణాలతో ఆమె గొంతు కోశారు. ఆమెను తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నూపుర్ తల్వార్ హత్య చేసినట్లుగా 2013లో  సీబీఐ కోర్టు ప్రకటించి, వారికి యావజ్జీవ శిక్ష విధించింది. కూతురి హత్య కేసుతో పాటుగా పనిమనిషి హేమ్ రాజ్ హత్యకేసులోనూ వారిని దోషులుగా సీబీఐ కోర్టు ప్రకటించింది. అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. నాలుగేళ్ళ తరువాత తీర్పు వెలువడింది.

అలహాబాద్ హై కోర్టు డివిజన్ బెంచ్ ఈ కేసుపై విచారణను  సెప్టెంబర్ లో ముగించి తీర్పును రిజర్వులో ఉంచింది. ఈ కేసులో ఎన్నో నాటకీయ మలుపులు చోటు చేసుకున్నాయి. మొదట ఆరుషి హత్యకు కారణమని భావించిన హేమ్ రాజ్  రెండు రోజుల పాటు కన్పించకుండా పోయాడు. దాంతో ఆయన పై అనుమానాలు కలిగాయి. రెండు రోజుల తరువాత అదే ఇంటి టెర్రస్ పై ఆయన శవం దొరికింది.  దీంతో ఆరుషి హత్యను పరువు హత్యగా కూడా భావించారు. హేమ్ రాజ్ తో ఆరుషి సన్నిహితంగా ఉండడం ఈ దంపతుల కంటబడి, వారిద్దరి హత్యకు కారణమై ఉండవచ్చని కూడా పోలీసులు భావించారు. తల్లిదండ్రులే ఆరుషిని హత్య చేసినట్లుగా సీబీఐ గానీ, పోలీసులు గానీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేకపోయారు. ఓ దశాబ్ది కాలంలో ఈ కేసు సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది.  ఈ దంతవైద్య దంపతులకు నార్కో టెస్ట్ లు కూడా నిర్వహించారు. ఏ దశలో కూడా అధికారులు  సరైన ఆధారాలను పొందలేకపోయారు.

గత దశాబ్ది కాలపు మిస్టీరియస్ మర్డర్స్ లో ఒకటిగా ఆరుషి హత్య కేసు నిలిచింది. సాధారణంగా నేరం రుజువు చేసే బాధ్యత పోలీసులపైనే ఉంటుంది. ఈ కేసులో మాత్రం సీబీఐ కోర్టు, తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యతను రాజేశ్ దంపతులపై మోపింది. కేవలం నేరం జరిగిన పరిస్థితులను ఆధారంగా చేసుకొనే వారిని దోషులుగా ప్రకటించి యావజ్జీవ శిక్ష విధించారు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Shruti haasan - Jaggesh

శృతి హాసన్ ని ఘోరంగా అవమానించిన హీరో

tdp leaders fight

కొట్టుకున్న తెలుగు తమ్ముళ్ళు, ఎమ్మెల్యేకు గాయాలు