in

హార్దిక్ పాండ్యాతో డేటింగ్ పై బాలీవుడ్ హీరోయిన్ స్పందన..!

Hardik Pandya - Elli Avram
Hardik Pandya - Elli Avram

టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో డేటింగ్ వార్తలపై బాలీవుడ్ నటి ఎల్లీ ఆవ్రమ్ స్పష్టతనిచ్చింది. పాండ్యాతో డేటింగ్ చేస్తున్నానంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడీ విషయం గురించి తాను ఏం మాట్లాడినా నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని.. ప్రతీ విషయానికి సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని, ప్రజలు ఎలా కావాలంటే అలా ఊహించుకోవచ్చని తేల్చి చెప్పింది.

ఇలాంటతి వార్తలపై స్పందిస్తే మరిన్ని పుకార్లకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందని.. ఇప్పటికే తన గురించి ఎన్నో తప్పుడు వార్తలు వచ్చాయని ఆమె తెలిపింది. సెలబ్రిటీల గురించి ప్రజలు ఏవేవో మాట్లాడుతుంటారని, అన్నింటికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పింది. అయితే హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా వివాహానికి ఎల్లీ అవ్రమ్ హాజరైంది. హార్దిక్‌ పక్కన నిలబడి ఫొటోలకు పోజులివ్వడంతో వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. వీటికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకే తాను ఇప్పుడు స్పందించినట్లు తెలిపింది. అయితే గతంలో హార్దిక్ పాండ్యా బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో డేటింగ్‌లో ఉన్నట్లు కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

drunk woman

తప్పతాగి పోలీసులపై చిందులేసిన అమ్మాయి

Amala paul spend a night with a producer

నాతో వ్యభిచారం చేయించాలనుకున్నాడు: హీరోయిన్ అమలాపాల్