in

సెల్ఫీ దిగాలని చూస్తే, ఏనుగు తొండంతో కొట్టి చంపేసిన వీడియో

elephant attack

పశ్చిమ బెంగాల్‌లో ఓ వ్యక్తి ఏనుగుతో సేల్ఫీ దిగాలని ప్రయత్నించగా ఆ ఏనుగు తొండంతో కొట్టి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని జల్‌పాయ్‌గురి జిల్లాకి చెందిన సాదిఖ్‌ అనే 40 ఏళ్ల వ్యక్తి స్థానిక బ్యాంక్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న అతనికి అటవీ ప్రాంతంలోని హైవేపై ఏనుగు వెళ్లడం కనిపించింది. ఏనుగుతో సెల్ఫీ తీసుకోవాలని భావించిన సాదిఖ్‌.. దాని దగ్గరకు వెళ్లాడు.

మొబైల్‌తో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడంతో.. ఏనుగు తొండంతో దాడి చేసింది. దాంతో సాదిఖ్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో స్థానికులు సాదిఖ్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Yamaha MT-09 Superbike

యూత్‌ కోసం 847 సిసితో యమహా కొత్త బైక్

Bandla Ganesh

బండ్ల గణేష్ కు ఆరునెలల జైలు శిక్ష, 15 లక్షలు జరిమానా