,

కేవలం మగవారికి మాత్రమే వచ్చే విచిత్రమైన రోగాలు ఏంటో తెలుసా..!

diseases for only men

వ్యాధులు కొన్ని ఆడవాళ్లకు మాత్రమే వస్తాయి. అలాగే మరికొన్ని వ్యాధులు మగాళ్లకే వస్తాయి. ఈ రోజు మగవారికే మాత్రమే వచ్చే 5 రోగాల గురించి తెలుసుకుందాం.

బట్టతల: బట్టతలని వ్యాధిగా గుర్తించాలా వద్ద అనే ప్రశ్నను కాసేపు పక్కనపెడితే.. ఈ సమస్య మాత్రం పురుషులకి మాత్రమే వస్తుంది. మరి స్త్రీలకు వెంట్రుకలు ఊడవా అంటే ఊదుతాయి. హెయిర్ ఫాల్ ఉంటుంది. కాని పురుషుల మాదిరిగా బట్టతల రాదు. ఈ బట్టతల ఎందుకు వస్తుంది అంటే అతిపెద్ద కారణం జీన్స్. తండ్రికి బట్టతల ఉంటే కొడుక్కి కూడా రావొచ్చు. అమ్మాయిలకి ఎంత జుట్టు రాలినా అది బట్టతల వరకు పోదు.

బ్లాడర్ లో రాళ్ళు: కిడ్నీల్లో రాళ్ళకు లింగభేదం ఉండదు. అవి ఆడవాళ్లకయినా, మగాళ్లకయినా వచ్చేస్తాయి. కాని బ్లాడర్ లో రాళ్ళు పురుషులకే వస్తాయి. బ్లాడర్ లో మినరల్ బిల్డప్ ఎకువ కావడం వల్ల మూత్రం ఎక్కువ మోతాదులో ఆపి ఉంచే అలవాటు ఉండడం వల్ల ఇవి ఏర్పడతాయి. దీంతో మూత్రంలో మంట, కడుపు నొప్పి ఎలాగో ఉంటాయి. వీరితో పాటు పురుషాంగంలో విపరీతమైన నొప్పి పుట్టొచ్చు.

పెరోనిజ్: సహజంగా పురుషాంగం కొంచెం ఎడమవైపుకి వంగి ఉంటుంది. దీన్ని చూసి కంగారుపడకండి. సహజమే అన్నాం కదా. కాని పెరోనిజ్ అనే వింత వ్యాధిని జీన్స్ ద్వారా పొందేవారి పురుషాంగం బాగా వంగిపోతుంది. ఎంతలా వంగుతుందంటే వారు లైంగిక చర్యల్లో కూడా పాల్గొనలేని స్థితి ఉంటుంది. అంతే కాకుండా పురుషాంగం సైజు తగ్గిపోతుంది. ఇక అంగస్తంభనల గురించి మరిచిపోండి.

టెస్టికులర్ క్యాన్సర్: బ్రీస్ట్ క్యాన్సర్ స్త్రీలకు వస్తుందని తెలుసు. కాని అదేరకమైన రొమ్ము క్యాన్సర్ పురుషులకి కూడా వస్తుంది. ఎందుకంటే ప్రతి బిడ్ద తల్లి కడుపులో మొదట స్త్రీ గానే ఉంటుంది. ఆ తరువాత క్రోమోజోమ్స్ ప్రభావం వల్ల మగ బిడ్డ, ఆడ బిడ్డ ఎవరి క్రోమోజోమ్ కాంబినేషన్ ని బట్టి ఆ లింగానికి మారిపోతారు/ఉండిపోతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పురుషులకి నిపుల్స్ ఉండటానికి కారణం అదే. స్త్రీలకు వచ్చే బ్రెస్ట్ మగవారికి కూడా రావొచ్చు. కాని టెస్టికులర్ క్యాన్సర్ కేవలం మగవారికే వస్తుంది. ఎందుకంటే వృషణాలు కేవలం మగవారికే ఉంటాయి.

ఆల్పోర్ట్ సిండ్రోం:
ఇదేం జబ్బు.. దీని గురించి ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా? ఇది చాలా అరుదుగా తలెత్తే సమస్య లెండి. జీన్స్ వలన వస్తుంది. అందులోనూ కేవలం పురుషుల ప్రాణాలనే తీస్తుంది. ఈ సిండ్రోం వస్తే ఒకేసారి కిడ్నీలు, కనులు, చెవులు పనిచేయడం తగ్గిస్తాయి. సైలెంట్ గా ప్రాణాలు ఎగరేసుకుపోతుంది. మరి ఇది స్త్రీలపై ఎందుకు ప్రభావం చూపదంటే, స్త్రీలలో రెండు X క్రోమోజోమ్స్ ఉంటాయి. కాని పురుషుల్లో కేవలం ఒకటే X క్రోమోజోం ఉంటుంది కదా. అందుకే పురుషుడి శరీరం ఈ జబ్బు ముందు బలహీనం.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%