in

సినీ నటి మేనకోడలు అదృశ్యం, ఆచూకి కోసం ప్రయత్నాలు

Disco Shanti - Lalithakumari Niece Abirna

దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కోశాంతి మేనకోడలు అదృశ్యం కలకలం రేపుతోంది. శాంతి సోదరుడు, అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ మొళి వర్మన్ కుమార్త్ అయిన అబ్రిన్ (17) కనిపించటం లేదని పోలీసులకు కంప్లయింట్ ఇవ్వటంతోపాటు మీడియాను ఆశ్రయించారు. సెప్టెంబర్ 6వ తేదీన చెన్నైలోని ఇంటి నుంచి బయటకు వెళ్లిందని.. అప్పటి నుంచి ఆచూకీ లేదన్నారు.

టీనగర్ పాండిబజార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారని.. అయినా ఐదు రోజులుగా కనీస సమాచారం లేదన్నారు. స్కూల్ చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయని.. వాటిలో కొన్ని పనిచేయకపోవటంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. దీంతో కేసు విచారణ క్లిష్టంగా మారింది. మీడియా ద్వారా ప్రచారం జరిగితే కొంత సమాచారం లభించొచ్చే ఉద్దేశంతోనే పత్రికలు, టీవీలకు సమాచారం ఇస్తున్నామన్నారు. చెన్నై సినీ ఇండస్ట్రీలోని నటీనటుల సంఘం అయిన నడిగార్ కు కూడా సమాచారం ఇచ్చారు. దీంతో సినీ నటులు అందరూ అబ్రిన్ ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Smriti Irani comments on rahul gandhi

రాహుల్ నువ్వు ఒక పనికిరాని రాజకీయ వారసుడు: స్మృతి ఇరానీ

Pakistan - World-XI - T20I

సొంత పిచ్ పై అదరగొట్టిన పాకిస్తాన్, తొలి టీ-20లో విజయం