in ,

అంబులెన్స్ లేక కొడుకు శవాన్ని మోసుకెళ్లిన తండ్రి

Father carries his son dead body

పగవాడికికూడా రాకూడని పరిస్థితి ఇది. కానీ ఉత్తర ప్రదేశ లో ఓ తండ్రికి ఎదురైంది. మానవత్వానికే మచ్చ తెచ్చే ఘటన ఉత్తర ప్రదేశ్ ఇటావాలో జరిగింది. గత ఏడాది ఒడిశాలో భార్య శవాన్ని 10 కిలో మీటర్లు భుజాలపై మోసుకెళ్ళిన గిరిజనుడి దీన గాథ మరువక ముందే అలాంటి సీనే రిపీటయ్యింది. అనారోగ్యంతో చనిపోయిన కొడుకు శవాన్ని తరలించేందుకు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిరాకరించడంతో ఓ తండ్రి మృతదేహాన్ని ఇలా మోసుకెళ్ళాడు.

వివరాల్లోకి వెళ్తే … రోజువారీ కూలీ అయిన ఉదయ్‌వీర్‌ కొడుకు పుష్పేంద్ర కాళ్లు నొప్పి కారణంగా కొంతకాలంగా నడవలేకపోతున్నాడు. అంబులెన్స్ సౌకర్యం లేని ఊరి నుంచి ఉదయ్‌వీర్‌ 7 కిలో మీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. పుష్పేంద్ర కేవలం కాళ్ళ నొప్పతో బాధపడుతున్నాడని చెప్పిన డాక్టర్లు వారిని ఇంటికి వెళ్ళిపొమ్మన్నారు. తీరా వైద్యులు పుష్పేంద్రకు వైద్యం చేయకపోవడంతో అతను చనిపోయాడు. పుష్పేంద్ర మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆసుపత్రి యాజమాన్యం కనీసం అంబులెన్స్‌ కూడా ఇవ్వలేదు. ఆస్నత్రిలో నాలుగైదు అంబులెన్సులు అందుబాటులో ఉన్నా కనీకరం లేకుండా వ్యవహరించారు. చేసిది లేక ఉదయ్‌వీర్‌ 15ఏళ్ల కొడుకు శవాన్ని భుజాన వేసుకొని ఆసుపత్రి నుంచి ఇంటికి బయల్దేరాడు. ఓ వ్యక్తి మొబైల్‌ ఫోన్‌లో ఈ దృశ్యాలను రికార్డు చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. శవాన్ని తీసుకెళ్ళడానికి అంబులెన్స్ ఇవ్వని ఇటావా ప్రభుత్వాసుపత్రి డాక్టర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

preet shergil

యువతుల్ని ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టడం అతనికి అలవాటు

Rahul Tripati

త్రిపాఠి వీర విహారం, కేకేఆర్ పై పుణె ఘన విజయం