,

యువతుల్ని ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టడం అతనికి అలవాటు

preet shergil

పశ్చిమబెంగాళ్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డ కీచక కొరియెగ్రాఫర్ ప్రీత్ షెర్గిల్ చరిత్రను పోలీసులు బయటకు తీస్తున్నారు. తనకున్న ఇమేజ్‌తో అనేక మంది యువతుల్ని ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టడం వీడియోలు తీయటం నిందితునికి అలవాటని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితున్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు నార్త్ జోన్ పోలీసులు. సికింద్రాబాద్ వెస్ట్ మారెడ్ పల్లిలో నిందితుడు కొరియోగ్రాఫర్ ప్రీత్ షెర్గిల్ బెంగాల్ యువతిని మూడ్రోజుల క్రితం బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుని అపార్ట్ మెంట్ నుండి ఎట్టకేలకు తప్పించుకున్న యువతి పశ్చిమబెంగాల్ వెళ్తూ శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం హైదరాబాద్ సీపీ ఆదేశాలతో దర్యాప్తు కొనసాగుతుండగా నిందితుని గత నేర చరిత్రపై కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండగా కీచకపర్వాలు ఎన్నో వెలుగుచూస్తున్నాయి.

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%