in

ఛలో సినిమా రివ్యూ, సినిమా ఎలా ఉందంటే..!

chalo movie review, story, talk
chalo movie review, story, talk

నాగ శౌర్య, రష్మిక మండన్న, అచ్యుత్ కుమార్, నరేష్, వైవా హర్ష, రఘు బాబు, ప్రగతి, ప్రవీణ్, సత్య, సుదర్శన్, రాజేంద్రన్ తదితరులు ప్రధాన తారాగణంగా వెంకి కుడుముల‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఛలో’. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. మంచి అంచనాలతో ఈ రోజు ‘ఛలో’ చిత్రం విడుదలవుతోంది. మరి సినిమా ఎలా ఉందొ చూద్దాం..

కథ విషయానికి వస్తే …. హరి(నాగశౌర్య) ఓ పోకిరి చిన్న వ‌య‌స్సు నుంచి గొడ‌వ‌లు, కోట్లాట‌లు అంటే చాలా ఇష్టం. దీంతో విసుగెత్తిన త‌ల్లిదండ్రులు హ‌రిని తమిళనాడు సరిహద్దు ప్రాంతం ‘తిరుప్పురంస‌కు వాళ్ల బంధువుల ఇంటికి పంపుతారు. అస‌లే కోట్లాట‌లు , కుమ్మ‌లాట‌లతో చీలిపోయిన తెలుగు- త‌మిళ‌వ‌ర్గం ఆ ఊరిలో ఓ కంచెను వేసుకొని ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకుంటుంటారు. అయితే అప్పుడే వ‌చ్చిన హ‌రిని చూసిన కొంత‌మంది త‌మిళులు అత‌న్ని చంపాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తారు. అస‌లే తెలుగు వాడు అయిన హ‌రి త‌మిళ సామాజిక వ‌ర్గం పెద్ద‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఓ నాయ‌కుడి కూతురు కార్తీక(రష్మిక)ను ప్రేమిస్తాడు . కానీ హ‌రిని కార్తీక ప్రేమించ‌దు. కానీ ఆరెండు ఊళ్ల‌ని క‌లిపేందుకు కార్తీక ఊరు ఒక్కటిగా కలిస్తేనే తప్ప మన ప్రేమ గెలవదని మెలిక పెడుతుంది. ఒకప్పుడు అన్నదమ్ముల్లా ఉన్న ఆ ఊరి తెలుగు, తమిళ ప్రజలు చంపుకునేంత బద్దశత్రువులు కావడానికి కారణమేంటి? మరి తన ప్రేమ కోసం హరి ఊరిని ఒక్కటిగా చేశాడా..లేదా… తన ప్రేమను గెలిపించుకున్నాడా లేదా.. అనేదే మిగిలిన కథ.

chalo movie
chalo movie

నాగ శౌర్య.. హరి పాత్రలో బాగా నటించాడు. లుక్స్ పరంగా కూడా బావున్నాడు. ఈ సినిమా కోసం తన శాయశక్తులా కృషి చేశాడు నాగశౌర్య. యాక్షన్ సీన్స్‌లో బాగా నటించాడు. రష్మిక ప్రతి ఎమోషన్‌ను బాగా ఎక్స్ ప్రెస్ చేసింది. హీరో తల్లిదండ్రులుగా నటించిన సీనియర్ నరేష్, ప్రగతి తమ పాత్రల్లో ఇమిడిపోయారు. అచ్యుతకుమార్, మైమ్ గోపీ, ప్రవీణ్, జివి కుమార్, వైవా హర్ష, రఘుబాబు, పోసాని కృష్ణ మురళి, రాకెట్ రాఘవ, రాజేంద్రన్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సత్య, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది.

వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా అందించాడు. ఇది తొలి సినిమానే అయినప్పటికీ…. డైరెక్షన్ పరంగా బాగా హ్యాండిల్ చేశాడు. నటీనటుల నుండి తనకు కావాల్సింది రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. డైలాగులు కూడా ఆకట్టునే విధంగా రాశాడు. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బావుంది.

chalo
chalo

మొత్తానికి ఈ చిత్రం కామెడీతో పాటు హీరో హీరోయిన్ ల మధ్య ప్రేమ సన్నివేశాలు బాగున్నాయి. కథలో కొంచెం బలం ఉంటే ఇంకా బాగుండేది. సినిమా ముగింపు ఆకట్టుకునే అంత లేదు. కానీ కుటుంబంతో వెళ్లి హాయిగా సినిమా చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

Archana vedha

ప్రియుడి గురించి చెప్పిన హీరోయిన్ అర్చన

India vs South Africa - Virat Kohli - Du plessis

తొలి వన్డేలో కోహ్లీ సేన ఘనవిజయం