in

భాగమతి మూవీ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే..!

bhaagamathie movie review, story, public talk
bhaagamathie movie review, story, public talk

అనుష్క, ఉన్ని ముకుందన్‌, జయరామ్‌, ఆశా శరత్‌, మురళీ శర్మ ప్రధాన తారాగణంగా జి. అశోక్‌ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలవుతున్న చిత్రం ‘భాగమతి’. టాలీవుడ్ లేడీ ఓరియంటెండ్ సినిమాలకు పెట్టింది పేరు అనుష్క. అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాల తర్వాత మరోసారి భాగమతితో తన సందడి మొదలైంది. మరి భాగమతి ప్రేక్షకుల అంచనాలను అందుకుందా… లేదా ఓ సారి చూద్దాం..

కథ విషయానికి వస్తే .. ఐఏఎస్‌ అధికారి చంచల(అనుష్క) కేంద్ర మంత్రి ఈశ్వర్‌ ప్రసాద్‌(జయరాం) దగ్గర పర్సనల్‌ సెక్రటరీగా పనిచేస్తుంటుంది. మచ్చలేని నాయకుడిగా చలామణి అవుతూ రాజకీయంగా సొంత నిర్ణయాలు తీసుకుంటుండటంతో అతన్ని ఏదో ఒక కేసులో ఇరికించాలని అధిష్ఠానం పెద్దలు నిర్ణయిస్తారు. అప్పటికే ఒక హత్య కేసులో జైలులో ఉన్న చంచలను సీబీఐ తన కస్టడీలోకి తీసుకుని పురాతన భాగమతి బంగ్లాకు తరలించి, ఈశ్వర్‌ప్రసాద్‌ చేసిన వ్యవహారాలపై ఆరా తీస్తుంది. ఈ క్రమంలో ఈశ్వర్‌ ప్రసాద్‌ గురించి ఎలాంటి నిజాలు తెలిశాయి. హత్య కేసులో చంచల జైలుకు వెళ్లడానికి కారణం ఏంటి? ఆమె ఎవరిని? ఎలా హత్య చేసింది? ఆమెకూ, కాళంగి రాజ్య భాగమతి శతపత్ర రాణికీ సంబంధం ఏంటి? అనేది సినిమాలో చూడాల్సిందే..

ఒక రాజకీయ నాయకుడి నేర ప్రస్థానం చుట్టూ కథను రాసుకున్న దర్శకుడు దాన్ని భాగమతి బంగ్లా నేపథ్యాన్ని జోడించి, భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ కథలో నాలుగైదు చోట్ల హారర్‌ ఎలిమెంట్స్‌ బలంగా పండాయి. తమన్‌ నేపథ్య సంగీతంతో ప్రేక్షకుడిని భయపెట్టే ప్రయత్నం చేశారు. భాగమతి బంగ్లాలోకి వెళ్లాకే అసలు కథ వూపందుకుంటుంది. ద్వితీయార్ధంలో వచ్చే మలుపులు సినిమాను ఆసక్తి కరంగా నడిపిస్తుంది. సినిమాలో పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

అనుష్క భాగమతిగా మరోసారి తన నటనతో విశ్వరూపం చూపించింది. ఐఏఎస్‌ ఆఫీసర్‌ చెంచలగా హుందాగా కనిపించిన స్వీటీ, భాగమతిగా రౌద్ర రసాన్ని కూడా అద్భుతంగా పలికించింది. మినిస్టర్‌ ఈశ్వర్‌ ప‍్రసాద్‌గా.. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో జయరామ్‌ నటన ఆకట్టుకుంటుంది. హీరోగా నటించిన ఉన్ని ముకుందన్ ది చిన్న పాత్రే అయినా తనదైన హావ భావాలతో మెప్పించాడు . ఇతర పాత్రల్లో మురళీ శర్మ, ధనరాజ్, విధ్యుల్లేఖ రామన్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు అశోక్‌ కథ రాసుకున్న విధానం, కథనాన్ని అల్లిన వైనం బాగుంది. హారర్‌ ఎలిమెంట్స్‌తో పాటు, పతాక సన్నివేశాలపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

padma awards 2018

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం, ఎవరెవరికి వచ్చాయంటే..!

kathi mahesh anushka

భాగమతి సినిమాకి రివ్యూ ఇచ్చిన కత్తి మహేష్