in

బాహుబలి దెబ్బకు అన్ని రికార్డులు గల్లంతు

prabhas baahubali 2

విడుదలకు ముందే రికార్డుల లెక్కలు తిరగరాస్తుందనుకున్న బాహుబలి ఎట్టకేలకు తన స్టామినాను చూపించింది. మాములుగా తెలుగు సినిమాలు 100 కోట్లు సాధించడమే గొప్ప కానీ ఏకంగా బాలీవుడ్ ని తలదన్నేలా భారతదేశ చరిత్రలోనే సినిమా కలెక్షన్లలో మొదటి స్థానంలో నిలిచింది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2 కలెక్షన్ల సునామీకి బాలీవుడ్ దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్ళను సాధించిన చిత్రాలుగా ఉన్న పీకే , దంగల్ లను అధిగమించి మొదటి సస్థానంలో నిలిచింది. నిన్నటి వరకు 769 కోట్లతో అమిర్ ఖాన్ నటించిన పీకే సినిమా అగ్ర స్థానంలో ఉండగా.. దాన్ని దాటేసి 792 కోట్లతో ఒక తెలుగు సినిమా మొదటి స్థానంలో నిలిచింది.

ఇందులో చెప్పుకోవాల్సిన అసలైన విశేషమేమిటంటే పీకే సాధించిన లైఫ్ టైమ్ కలెక్షన్లను బాహుబలి-2 విడుదలైన ఆరు రోజుల్లోనే అధిగమించింది. అంతే కాకుండా 1000 కోట్లను కూడా ఈజీ గా క్రాస్ చేయగలదు అని ట్రేడ్ నిపుణులు తేల్చేశారు. ఈ విషయాన్ని సాధారణమైన వారు చెప్పలేదు బాలీవుడ్ బిజినెస్ ని గత 30 ఏళ్లుగా అతి దగ్గరగా చూస్తున్న ట్రేడ్ ఎక్స్ పర్ట్శ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నిజానికి ఒక తెలుగు సినిమా ఈ స్థాయిలో నిలుస్తుందని ఎవరు ఊహించలేదని వారు చెప్పారు.

Loading...

What do you think?

0 points
Upvote Downvote

Total votes: 0

Upvotes: 0

Upvotes percentage: 0.000000%

Downvotes: 0

Downvotes percentage: 0.000000%

K Viswanath honoured with Dada Saheb Phalke award

రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న కళాతపస్వి

Actress Nayanthara visits tirumala

Actress Nayanthara Visits Tirumala Venkateswara Temple